Dhoni Retirement IPL Final 2023 : దిగ్గజ క్రికెట్ ప్లేయర్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి ధోనీ ఆడడని విశ్లేషణలు వెలువడుతున్నాయి. దీనికి బలం చేకూర్చేలా గత కొన్ని రోజుల నుంచి అనుమానాస్పద ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఐపీఎల్ ఫైనల్ కూడా వర్షం కారణంగా వాయిదా పడి రిజర్వ్ డేకు షిఫ్ట్ అయింది. ఈ విషయం బయటకు రాగానే గతంలో జరిగిన సంఘటనకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
MS Dhoni Retirement : ఐసీసీ వరల్డ్ కప్ 2019 సెమీ ఫైనల్ మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఆ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రిజర్వ్డేకు వాయిదా పడింది. ఆ మ్యాచ్లో ధోనీ రనౌట్ అయ్యాడు. దీంతో న్యూజిలాండ్ 18 పరుగులు తేడాతో విజయం సాధించింది. అయితే, ధోనీ ఆడిన చివరి అంతర్జాతీయ మ్యాచ్ అదే కావడం గమనార్హం. ఆ తర్వాత కొన్ని నెలలకు ఇంటర్నేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు ఈ స్టార్. దీంతో ఈ ఐపీఎల్ కూడా రిజర్వ్ డే రోజు జరుగుతుండటం వల్ల.. ధోనీకి ఇదే చివరి మ్యాచ్ అంటూ బాధ పడుతున్నారు అభిమానులు.
Dhoni Retirement IPL Date : అయితే, ఈ విషయంపై ఇటీవలే ధోనీ స్పందించాడు. క్వాలిఫయర్-1 తర్వాత హర్ష బోగ్లే.. ధోనీని తన భవిష్యత్ ప్రణాళికల గురించి అడగగా వివరణ ఇచ్చాడు. రిటైర్మెంట్ గురించి సరైన సమాధానం చెప్పకపోయినా.. ఆ విషయంపై నిర్ణయం తీసుకోవడానికి తనకు ఇంకా 8-9 నెలల సమయం ఉందని చెప్పాడు. 'నాకు తెలియదు (ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అడిగితే). దానిపై ఓ నిర్ణయానికి రావడానికి ఇంకా 8-9 నెలల టైమ్ ఉంది. ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్ నాటికి జరుగుతుంది. అయితే దాని గురించి ఇప్పుడే తలనొప్పి ఎందుకు. నిర్ణయించుకోవడానికి నాకు తగినంత సమయం ఉంది. కానీ, జట్టులో ఆడుతున్నా.. లేదా బయట ఎక్కడో కూర్చున్నా.. నేను ఎప్పుడూ సీఎస్‌కే వెంటే ఉంటాను. నాకు నిజంగా తెలియదు' అని సమాధాన మిచ్చాడు.
Dhoni Retirement Comments : దీనికి అభిమానులు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించొద్దు అని కొందరు కోరుకుంటున్నారు. మరికొందరు ఈ స్టార్ రిటైర్ అవడం ఖాయమని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. అయితే, జరిగిన పరిణామాలు, పలువురు మాజీ క్రికెటర్ల వ్యాఖ్యలు చూస్తుంటే ధోనీ రిటైర్మెంట్ లాంఛనమేనని క్రీడా విశ్లేషణకులు అభిప్రాయపడుతున్నారు.