దిల్లీ వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ అదరగొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. దీంతో 172 రన్స్ లక్ష్యాన్ని ముంబయి ఛేదించాల్సి ఉంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్(42) టాప్ స్కోరర్.
రాణించిన బట్లర్, శాంసన్.. ముంబయి లక్ష్యం 172
ముంబయి ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్‌లో అదరగొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులను చేసింది. దీంతో 172 రన్స్ లక్ష్యాన్ని ముంబయి ఛేదించాల్సి ఉంది.
ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్
ఓపెనర్లు జోస్ బట్లర్(41), యశస్వీ జైశ్వాల్(32) జట్టుకు శుభారంభాన్నిచ్చారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్(42), శివమ్ దూబే(35) కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో బ్యాటింగ్ చేసిన రియాన్ పరాగ్(7), డేవిడ్ మిల్లర్(8) ఫర్వాలేదనిపించారు. ముంబయి బౌలర్లు రాహుల్ చాహర్ 2, ట్రెంట్ బౌల్ట్ , బుమ్రా చెరో ఒక వికెట్‌ను పడగొట్టారు.