తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ బయోబబుల్​ నుంచి తప్పుకున్న రిఫరీ

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్​) బయోబబుల్​ నుంచి మ్యాచ్​ రిఫరీ నిష్క్రమించాడు. మనూ నాయర్​.. తన తల్లి మరణం తర్వాత విధులను వదిలి స్వస్థలానికి వెళ్లినట్లు తెలుస్తోంది.

Match referee Manu Nayyar leaves IPL bubble after mother's death
ఐపీఎల్​ బయోబబుల్​ నుంచి తప్పుకున్న రిఫరీ

By

Published : Apr 30, 2021, 9:43 AM IST

ఐపీఎల్​ మ్యాచ్​ రిఫరీగా పనిచేస్తోన్న మనూ నాయర్​.. తన తల్లి మరణం తర్వాత బయోబబుల్​ను వీడాడు. ఆయన చివరిసారిగా దిల్లీ క్యాపిటల్స్​, రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్​కు రిఫరీగా వ్యవహరించాడు.

రంజీల్లో దిల్లీ జట్టు తరఫున ఆడిన మనూ నాయర్​.. అహ్మదాబాద్​, ముంబయి వేదికగా ఈ సీజన్​లో జరిగిన ఐపీఎల్​ మ్యాచ్​లకు రిఫరీగా పనిచేశాడు. తన తల్లిని కడసారిగా చూసేందుకు గురువారం దిల్లీ బయల్దేరి వెళ్లాడు మనూ నాయర్​. అయితే ఆమె ఏ కారణంగా మరణించారనేది తెలియలేదు.

అంతకుముందు భారత్​కు చెందిన అంపైర్​ నితిన్​ మేనన్​తో పాటు ఆస్ట్రేలియాకు చెందిన పాల్​ రీఫెల్​.. లీగ్​ నుంచి తప్పుకున్నారు. తన​ కుటుంబం కరోనా బారిన పడటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాడు మేనన్​. ఆసీస్​ ప్రభుత్వం.. ప్రయాణ ఆంక్షలు విధించడం వల్ల రీఫెల్ నిష్క్రమించాడు​. వీరితో పాటు ఆటగాళ్లు రవిచంద్రన్​ అశ్విన్​, ఆండ్రూ టై, లియామ్​ లివింగ్​ స్టోన్​, ఆడమ్​ జంపా, కేన్ రిచార్డ్సన్​ ఐపీఎల్​ నుంచి ఇప్పటికే తప్పుకున్నారు.

ఇదీ చూడండి..ఐపీఎల్​ నుంచి తప్పుకున్న ఇద్దరు అంపైర్లు

ABOUT THE AUTHOR

...view details