చెన్నై సూపర్‌కింగ్స్ ప్లేఆఫ్స్ చేరడంపై(csk qualifys for playoffs for 2021) ధోని సంతోషం వ్యక్తం చేశాడు. తమ జట్టు సభ్యుల ఆటతీరును ప్రశంసించాడు. ఇప్పటికి చాలా సాధించినప్పటికీ.. చేయాల్సింది ఇంకా చాలా మిగిలే ఉందని(ipl ms dhoni)అన్నాడు. గత ఏడాదితో పోలిస్తే తాము ఈసారి బలంగా పుంజుకున్నామని అన్నాడు.
'ప్రతిసారి మ్యాచ్‌లు గెలువలేకపోవచ్చు. గత ఏడాది మేం అనుకున్నంత సాధించలేకపోయాం. సాకులు వదిలి ప్రయత్నించడమే ప్రధానం. ఈసారి అది మేం చేశాం. ఈ స్థాయికి చేరడానికి మా ఆటగాళ్లు చక్కని ఆటతీరును కనబరిచారు. బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విభాగాల్లో ఆటను బాధ్యతాయుతంగా ఆడాం. మా బ్యాటింగ్ లైనప్ బాగుంది. ఎలాంటి సమయాల్లోనైనా దూకుడుగా ఆడే సత్తా ఉంది. బ్యాలెన్స్‌గా ఆడాం కాబట్టే ఈ స్థాయికి చేరాం' అని ధోనీ చెప్పాడు.