దిల్లీలో కరోనా తీవ్రంగా ఉన్నా అక్కడి నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లను తరలించే ఉద్దేశంతో బీసీసీఐ లేదు. నాలుగు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు చెన్నై, హైదరాబాద్, రాజస్థాన్, ముంబయి... దిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో ఈ నెల 28 నుంచి మే 8 వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడాల్సిఉంది. 26వ తేదీ వరకు జట్లన్నీ ఇక్కడికి చేరుకుంటాయి.
కరోనా ఉన్నా.. దిల్లీ మ్యాచ్‌లు అక్కడే!
దిల్లీలో కరోనా ఉద్ధృతి భీకర స్థాయిలో ఉన్నా.. అక్కడి నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు తరలించే అవకాశం కనిపించడం లేదు. బయోబబుల్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయని, షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయని దిల్లీ క్రికెట్ సంఘం తెలిపింది.
దిల్లీలో ఐపీఎల్ మ్యాచ్‌లు
"షెడ్యూల్ ప్రకారమే దిల్లీలో ఐపీఎల్ జరుగుతుంది" అని దిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రోహన్ జైట్లీ చెప్పాడు. "బయోబబుల్‌కు ఎలాంటి ముప్పూ లేదు. నేను బబుల్‌లో భాగం కాకుంటే అందులో ఉండే వాళ్లెవరినీ నేను కలవలేను. బబుల్ చాలా సురక్షితం" అని అన్నాడు. గ్రౌండ్స్‌మెన్ సహా మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించిన వాళ్లంతా బబుల్‌లో ఉన్నారని తెలిపాడు.
ఇదీ చూడండి:'బుమ్రా కంటే సిరాజే ముందుంటాడు'