గత రెండు మ్యాచ్‌ల నుంచి ఫామ్‌లోకి వచ్చిన ముంబయి ఇండియన్స్‌తో తలపడేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. పాయింట్ల పట్టికల్లో ముందుకు దూసుకెళ్లాలని రోహిత్.. ఈ సారైనా విజయం సాధించి, సక్సెస్ ట్రాక్‌లోకి రావాలని విలియమ్సన్ పట్టుదలతో ఉన్నాడు. ఇరుజట్లు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగు, ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి.
ముంబయి జోరు కొనసాగించేనా?
టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ముంబయి.. ఈ సీజన్లో గతఫామ్ను చూపలేక సతమతమవుతోంది. ఓటమితో సీజన్‌ను ప్రారంభించిన రోహిత్ సేన.. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో విజయం సాధించింది. అయితే గత రెండు మ్యాచ్‌ల విజయాలు సాధించింది. ఇప్పుడు సన్‌రైజర్స్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకెళ్లాలని పట్టుదలతో ఉంది. డికాక్, పొలార్డ్, రోహిత్‌తో బ్యాటింగ్ దళం బలంగా ఉంది.
బుమ్రా, బౌల్ట్, రాహుల్ చాహర్, కౌల్టర్ నైల్ బౌలింగ్ దళం బలంగా ఉన్నప్పటికీ వారు ఇంకా మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఉంది. ఆల్‌రౌండర్లు కృనాల్, హార్దిక్ పాండ్య ఇంకాస్త మంచి ప్రదర్శన చేయాలి. మొత్తంగా జట్టు సమష్టిగా రాణిస్తే ముంబయి మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడం ఖాయం.