రాజస్థాన్ జట్టుతో మ్యాచ్‌లో దిల్లీ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం వల్ల, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది దిల్లీ. కెప్టెన్ పంత్ అర్ధశతకంతో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.
దిల్లీ తడ'బ్యాటు'.. రాజస్థాన్ లక్ష్యం 148
వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం వల్ల రాజస్థాన్‌కు 148 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది దిల్లీ. ముంబయి వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీకి ప్రారంభంలో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు పృథ్వీషా(2), ధావన్(9) సహా రహానె(8), స్టోయినిస్(0) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. అనంతరం కెప్టెన్ పంత్(51) కొత్త కుర్రాడు లలిత్ యాదవ్‌తో(20) కలిసి స్కోరును మెల్లగా పెంచాడు. ఈ క్రమంలోనే అర్ధశతకం చేసిన తర్వాత రనౌట్ అయ్యాడు.
మిగతా బ్యాట్స్‌మెన్‌లో టామ్ కరన్(21), వోక్స్(15), అశ్విన్(7).. ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. రాజస్థాన్ బౌలర్లలో ఉనద్కత్ 3, ముస్తాఫిజుర్ 2, మోరిస్ ఓ వికెట్ పడగొట్టారు.