IPL 2023 Qualifier 2 : ఐపీఎల్ 16వ సీజన్ అంతిమ దశకు చేరుకుంది. ఫైనల్‌కు వెళ్లేందుకు క్వాలిఫయర్-2లో గుజరాత్, ముంబయి మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఇన్నింగ్స్ ముగిసింది. 3 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. ముంబయికి 234 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (129) అన్‌స్టాపబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. 60 బంతుల్లో 10 సిక్స్‌లు, 7 ఫోర్లతో శతక్కొట్టాడు. మరో ఓపెనర్ వృద్ధిమాన్ సహా (18) పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. ఇక మరో బ్యాటర్ సాయిసుదర్శన్ హాఫ్ సెంచరీకి దగ్గర్లో రిటైర్ట్ హర్ట్ అయ్యాడు. హార్దిక్ పాండ్య (28), రషీద్ ఖాన్ (5) ఇక ముంబయి బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్, పీయుశ్ చావ్లా చెరో వికెట్ తీశారు.
గిల్ అన్‌స్టాపబుల్ సెంచరీ.. ఐపీఎల్ చరిత్రలో రికార్డు..
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో గుజరాత్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ విపరీత ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 3 సెంచరీలతో దుమ్మురేపాడు. ఇలా ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి పిన్న వయస్కుడిగా (23 ఏళ్ల 260 రోజులు) నిలిచాడు. ఇక నాలుగు సెంచరీలతో ఈ జాబితాలో బట్లర్ (2022 సీజన్), విరాట్ కోహ్లీ (2016)లో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు.
ఇషాన్‌కు గాయం..
శుభ్‌మన్ గిల్ అద్భుత సెంచరీతో చెలరేగిన సమయంలోనే ముంబై కీపర్ ఇషాన్ కిషన్‌కు దెబ్బ తగిలింది. దీనికి కారణం ఎవరో కాదు.. ముంబై పేసర్ క్రిస్ జోర్డాన్. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేయడంలో జోర్డాన్ దారుణంగా విఫలమయ్యాడు. ముందుకు చూడకుండా వచ్చిన జోర్డాన్ ఇషాన్‌కు ఢీకొట్టాడు. అతడి భుజం ఇషాన్ కంటికి తగిలింది. నొప్పితో ఇషాన్ కిషన్ బాధపడ్డాడు. అనంతరం పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. దీంతో ముంబయి అభిమానుల్లో ఆందోళన నెలకొంది.