తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023: విజృంభించిన చెన్నై బౌలర్లు.. ముంబయి స్కోరు ఎంతంటే? - ఐపీఎల్​ 2023 చెన్నై సూపర్​ కింగ్​స్

ఐపీఎల్​ 16వ సీజన్​లో ముంబయితో జరుగుతున్న మ్యాచ్​లో చెన్నై బౌలర్లు విజృంభించారు. 20 ఓవరల్లో 157 పరుగులకే ముంబయిని కట్టడి చేశారు.

ipl 2023 mumbai indians chennai super kings match
ipl 2023 mumbai indians chennai super kings match

By

Published : Apr 8, 2023, 9:12 PM IST

ఇండియన్ ప్రీమియర్​ లీగ్​ 16వ సీజన్​లో భాగంగా చెన్నై సూపర్​ కింగ్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ ఇన్నింగ్స్​ ముగిసింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ప్రత్యర్థి చెన్నైకు 158 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబయి జట్టులో టాప్​ స్కోరర్​గా ఇషాన్​ కిషన్​(32) నిలిచాడు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీశాడు. మిచెల్​ శాంట్నర్​, తుషార్​ దేశ్​పాండే తలో రెండు మగాలా ఒక వికెట్ పడగొట్టాడు.

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన ముంబయి ఇండియన్స్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (21) ఔటయ్యాడు. తుషార్‌ దేశ్‌పాండే వేసిన నాలుగో ఓవర్‌లో మొదటి బంతికి సిక్స్‌ బాదిన అతడు.. ఇదే ఓవర్‌లో చివరి బంతికి క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతున్న ఇషాన్‌ కిషన్‌ (32)కు జడేజా బ్రేక్‌లు వేశాడు. ప్రిటోరియస్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. మొదటి మ్యాచ్‌లో విఫలమైన సూర్యకుమార్‌ యాదవ్‌ రెండో మ్యాచ్‌లోనూ నిరాశపర్చాడు. ధోనీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. వేలంలో భారీ ధర పలికిన కామెరూన్‌ గ్రీన్‌ (12) ఔటయ్యాడు. జడేజా వేసిన 8.2 బంతిని గ్రీన్‌ బలంగా బాదాడు. వేగం వచ్చిన బంతిని జడ్డూ అద్భుతంగా ఒడిసిపట్టాడు. ఆ తర్వాత మరో బ్యాటర్​ అర్షద్‌ఖాన్‌ (2) వికెట్ల ముందు దొరికిపోయాడు. నిలకడగా ఆడుతున్న తిలక్ వర్మ (22).. జడేజా బంతికి ఎల్​బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (5) రుతురాజ్‌ గైక్వాడ్‌కు చిక్కాడు. తొలుత ఈ క్యాచ్‌ను బౌండరీ లైన్‌ వద్ద ప్రిటోరియస్‌ అందుకునే ప్రయత్నం చేశాడు. అనంతరం బౌండరీలోకి పడుతుండగా బంతిని గాల్లోకి విసరడంతో గైక్వాడ్ అందుకున్నాడు. దూకుడుగా ఆడుతున్న టిమ్​ డేవిడ్​ను తుషార్​ పాండే పెవిలియన్​కు పంపాడు. హృతిక్​ షోకిన్​(18*), పీయూశ్​ చావ్లా(5*) నాటౌట్​గా నిలిచారు.

రోహిత్​ నయా రికార్డు
ఈ మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ సారథి రోహిత్​ శర్మ.. కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. లీగ్​ చరిత్రలో ముంబయి జట్టు తరఫున ఐదు వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

గత ఐదు మ్యాచుల్లో సూర్య ఒక్క పరుగే..
చెన్నైతో జరుగుతున్న మ్యాచ్​లోనూ టీ20 సంచలనం సూర్య కుమార్​ యాదవ్​ విఫలమయ్యాడు. మొదటి మ్యాచ్‌లో విఫలమైన సూర్యకుమార్‌ రెండో మ్యాచ్‌లోనూ నిరాశపర్చాడు. శాంటర్న్‌ వేసిన చక్కటి బంతికి ధోనీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. తొలుత అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించగా.. ధోనీ రివ్యూకు వెళ్లి ఫలితం రాబట్టాడు. అయితే సూర్య ఆడిన గత ఐదు మ్యాచులు కలిపి సూర్య స్కోరు ఒక్క పరుగు మాత్రమే. అది కూడా ఈ మ్యాచ్​లో కొట్టినదే!

ABOUT THE AUTHOR

...view details