ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో భాగంగా కోలకతాతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. కోల్కతాకు 205 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చివర్లో విజయ్ శంకర్ చెలరేగిపోయాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది గుజరాత్. విజయ్ శంకర్ 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. చివరి రెండు ఓవర్లలో 45 పరుగులు వచ్చాయి. అందులో శంకర్ చేసినవే 41 పరుగులు ఉన్నాయి. సాయి సుదర్శన్ (53), శుభ్‌మన్ గిల్ (39) కూడా రాణించారు. వృద్ధిమాన్ సాహా (17), అభినవ్ మనోహర్ (14) పరుగులు చేశారు. ఇక, కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్ (3) వికెట్లు పడగొట్టి ఆకట్టుకోగా.. సుయాశ్ శర్మ ఒక వికెట్ పడగొట్టాడు.
హ్యాట్రిక్ ఫోర్లు, సిక్సులు..
అభినవ్ మనోహర్ క్రీజులోకి వచ్చిన వెంటనే దూకుడు ఆడాడు. ఉమేశ్ యాదవ్ వేసిన 13 ఓవర్‌లో తొలి మూడు బంతులను బౌండరీకి పంపించాడు. ఆ తర్వాత రెండు సింగిల్స్ వచ్చాయి. ఈ మ్యాచ్లో చెలరేగిపోయిన విజయ్ శంకర్.. చివరి ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు.