తెలంగాణ

telangana

ETV Bharat / sports

మహీ కోసం రాత్రంతా రోడ్లపైనే.. ఫ్యాన్స్​కు సిక్​లీవ్​ కష్టాలు.. ఇంతకీ ఫైనల్​ జరుగుతుందా? - రోడ్లపై పడుకున్న మహీ అభిమానులు

#IPL2023Finals : వర్షం కారణంగా ఐపీఎల్​ ఫైనల్​ మ్యాచ్​ను మే 29కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో మే 28న మ్యాచ్​ను వీక్షించేందుకు దూరపు ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులు.. రాత్రంతా రోడ్లపైనా.. బస్​ స్టాప్​, రైల్వే స్టేషన్లలోనే నిద్రపోయారు. మరోవైపు ఈరోజు(మే 29) కూడా మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడి వాతావరణ పరిస్థితి ఎలా ఉందంటే?

#IPL2023Finals
ఫైనల్‌ మ్యాచ్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ.. మహీ కోసం రాత్రంతా రోడ్లపైనే..

By

Published : May 29, 2023, 6:34 PM IST

IPL 2023 Final CSK vs GT : చెన్నై సూపర్‌ కింగ్స్‌- గుజరాత్ టైటాన్స్‌ మధ్య ఆదివారం జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌(#IPL2023Finals) భారీ వర్షం కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో రిజర్వ్​ డే ప్రకటించి సోమవారం మ్యాచ్ నిర్వహించనున్నారు. అయితే ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు భారీ ఎత్తున స్టేడియానికి తరలివచ్చారు.

కానీ వరుణడు కరుణించకపోవడం వల్ల అభిమానులంతా తీవ్రంగా నిరాశ చెందారు. మరీ ముఖ్యంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్​ మ్యాచ్‌ అని వార్తలు వస్తుండటం వల్ల.. అతడి అభిమానులు మిగితా రాష్ట్రాల నుంచి కూడా భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే వర్షం వల్ల మ్యాచ్‌ వాయిదా పడడంతో ఫ్యాన్స్‌ తీవ్రంగా బాధపడతమే కాదు.. నానా అవస్థలు కూడా పడ్డారు. సోమవారం మ్యాచ్ నిర్వహిస్తామని ప్రకటించడంతో.. తమ అభిమాన క్రికెటర్‌ ఆడే మ్యాచ్‌ను చూసేందుకు అహ్మదాబాద్‌లోనే ఉండిపోయారు. రాత్రంతా సీఎస్కే జెర్సీతోనే రోడ్ల పక్కన ఫుట్​పాత్​లపై, రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌లోనే నిద్రించారు. పగలంతా రోడ్లపైనే తిరుగుతూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా వైరల్‌ అవుతున్నాయి. వారంతా మహీ కోసమే వచ్చినట్లు అంటున్నారు.

సిక్​లీవ్ కష్టాలు..

ఇకపోతే.. సోమవారానికి మ్యాచ్​ను వాయిదా వేసే విషయం సంతోషం కలిగించేదే అయినా.. ఉద్యోగం చేసుకునే క్రికెట్​ ప్రేమికులకు మాత్రం కాస్త నిరాశని కలిగిస్తోంది. మార్నింగ్ షిఫ్ట్​ వారికి కాస్త ఇబ్బంది లేకపోయినా.. జనరల్​, ఈవెనింగ్​ షిఫ్ట్​ వాళ్లు తమ బాస్‌లకు ఏం కారణం చెప్పి తొందరగా ఆఫీస్‌ నుంచి బయటపడాలా లేదా లీవ్​ ఎలా పెట్టాలా అని గందరగోళం పడుతున్నారట. మ్యాచ్​ ప్రారంభం అయ్యేలోగా స్డేడియానికి చేరుకునేలా ప్లాన్​ చేసుకుంటున్నారట. కొంతమందైతే సిక్​లీవ్స్​ కూడా అప్లై చేసుకుంటున్నారట. దీనిపై జియో సినిమా ఓ ఫన్నీ మీమ్‌ను షేర్‌ చేసింది. హెచ్‌ఆర్‌ ఉద్యోగి ముందు కుప్పలు కుప్పలుగా ఉన్న సిక్‌ లీవ్‌ లెటర్స్‌ ఉంచి నవ్వులు పూయించింది. ఆ ఫొటో నెట్టింట్లో ట్రెండ్ అయింది.

చెప్పలేని పరిస్థితి..అభిమానులు ఆందోళన..

Ahmedabad Weather Live : ఇక ఈరోజు(మే 29) కూడా మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అక్కడ మధ్యాహ్నం కాస్త ఎండ వచ్చినట్టు కనిపించినప్పటికీ.. ప్రస్తుతం మళ్లీ పరిస్థితి కాస్త మారింది. ఈ కథనం రాసే సమయానికి తాజా సమాచారం ప్రకారం.. అహ్మదాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం మ్యాచ్‌ జరగాల్సి ఉన్న నరేంద్ర మోదీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. కానీ మ్యాచ్‌ ప్రారంభమయ్యే సమయానికి.. వర్షం కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఏం జరుగుతుందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించ కూడదని అభిమానులు ప్రార్థిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి..

సాధ్యం కాకపోతే గుజరాత్​దే..

Rain rules IPL : ఓకవేళ నేడు కూడా వర్షం వల్ల మ్యాచ్‌ జరగకపోతే.. గ్రూప్​ దశలో ఎక్కువ విజయాలను ఖాతాలో వేసుకుని.. పాయింట్ల పట్టికలో టాప్​ ప్లేస్​లో నిలిచిన గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్‌గా అనౌన్స్​ చేస్తారు. గుజరాత్ 14 మ్యాచుల్లో 10 విజయాలు సాధించింది. ఇకపోతే చెన్నై సూపర్ కింగ్స్‌ 14 మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలను దక్కించుకుంది.

ఇదీ చూడండి :

చెన్నై రన్నరప్​!.. అలా ఎలా డిసైడ్​​ చేస్తారు.. ఐపీఎల్​ ఫైనల్​ మ్యాచ్​ ఫిక్సింగా?

IPL 2023 : రిజర్వ్​ డే ఫైనల్​ మ్యాచ్​.. వాతావరణ పరిస్థితి ఎలా ఉందంటే?

ABOUT THE AUTHOR

...view details