తెలంగాణ

telangana

ETV Bharat / sports

CSK Playoffs : దటీజ్​ చెన్నై.. 14 సీజన్లలో 12 సార్లు.. జర్నీ సాగిందిలా..

IPL 2023 Chennai Super kings playoffs : ఐపీఎల్​లో చెన్నై సూపర్ కింగ్స్‌ మరో రికార్డు సాధించింది. ఈ మెగాలీగ్​లో అత్యధిక సార్లు ప్లేఆఫ్స్‌కు చేరిన జట్టుగా ఇప్పటికే ఘనత సాధించిన సీఎస్కే.. ఆ సంఖ్యను మరింత పెంచుకుంది. 12వ సారి ప్లేఆఫ్స్​కు అర్హత సాధించింది. ఈ సందర్భంగా ఈ క్యాష్​ రిచ్​ లీగ్​లో​ సీఎస్కే జర్నీ ఎలా సాగిందో చూద్దాం..

IPL 2023 Chennai Super kings playoffs journey
CSK Playoffs : దటీజ్​ చెన్నై.. 14 సీజన్లలో 12 సార్లు.. జర్నీ సాగిందిలా..

By

Published : May 20, 2023, 9:33 PM IST

IPL 2023 Chennai Super kings playoffs : ఇండియన్ ప్రీమియర్‌ లీగ్​లో చెన్నై సూపర్ కింగ్స్‌ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ క్యాష్​ రిచ్​ లీగ్​లో​ అత్యధిక సార్లు ప్లేఆఫ్స్‌కు చేరిన జట్టుగా ఇప్పటికే ఘనత సాధించిన సీఎస్కే.. ఆ సంఖ్యను మరింత పెంచుకుంది. తాజాగా దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో 77 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి.. ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది. దీంతో మొత్తం ఇప్పటివరకు 16 సీజన్లలో 12 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరిన ఏకైక టీమ్​గా నిలిచింది. ఆ తర్వాత ముంబయి ఇండియన్స్​ (ఈ సీజన్‌ కాకుండా) తొమ్మిది సార్లు చేరుకుంది. ఇకపోతే టోర్నీ చరిత్రలో ఇప్పటి వరకు నాలుగు టైటిళ్లను ముద్దాడింది సీఎస్కే. రెండుసార్లు లీగ్‌ స్టేజ్‌కే పరిమితమైంది. ఓ రెండు సీజన్లలో చెన్నైపై నిషేధం పడింది. ఓసారి సీఎస్కే ఏ సీజన్‌లో ఎలా ఆడిందో నెమరువేసుకుందాం..

  • 2008 సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫైనల్​లో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది.
  • 2009 సెమీఫైనల్‌ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయింది. దీంతో ఫైనల్‌కు అర్హత కప్‌ ముద్దాడాలనే కల నెరవేరలేదు.
  • 2010 సీజన్​లో ఎట్టకేలకు తన కలను సాకారం చేసుకుంది. తుదిపోరులో ముంబయిను ఓడించి ఛాంపియన్‌గా అవతరించింది.
  • 2011లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన సీఎస్కే.. ఫైనల్‌లో బెంగళూరును ఓడించి వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది.
  • 2012లో మళ్లీ బ్రేక్‌ పడింది. ఫైనల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఓడిపోయింది.
  • 2013లోనూ రన్నరప్‌గానే టోర్నీని ముగించింది. ఫైనల్​లో ముంబయి ఇండియన్స్​పై ఓడిపోయింది.
  • 2014 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరిన చెన్నై.. మూడో స్థానంతో సరిపెట్టుకుంది. రెండో క్వాలిఫయర్‌లో పంజాబ్‌ చేతిలో ఓడిపోయింది. కానీ, అదే ఏడాదిలో జరిగిన ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20 టోర్నీ విజేతగా నిలిచింది.
  • 2015లో మళ్లీ రన్నరప్‌గానే టోర్నీని ముగించింది. ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై ఓడిపోయింది. కానీ అత్యధిక సార్లు ప్లేఆఫ్స్‌కు చేరిన జట్టుగా చెన్నై రికార్డుకెక్కింది.
  • ఇక 2016, 2017 వరుసగా రెండు సీజన్లలో నిషేధానికి గురైన సీఎస్కే... 2018లో ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడిచింది.
  • 2019 సీజన్‌లోనూ చెన్నై మళ్లీ తుదిపోరుకు అర్హత సాధించింది. అయితే, ఫైనల్‌లో ఒక్క పరుగు తేడాతో ముంబయిపై ఓడిపోయి కప్‌ను వదిలేసుకుంది.
  • 2020లో లీగ్​ స్టేజ్​కు పరిమితమైంది.
  • 2021 ఫైనల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసి.. నాలుగోసారి టైటిల్‌ను ముద్దాడింది.
  • 2023లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. అయితే ఇప్పుడు ధోనీకి చివరి సీజన్‌గా భావిస్తున్న సమయంలో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది.

ABOUT THE AUTHOR

...view details