తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023: రాజస్థాన్​ X దిల్లీ​.. ఫస్ట్​ బ్యాటింగ్​ ఎవరిదంటే?

IPL 2023 : ఐపీఎల్ 2023లో భాగంగా రాజస్థాన్​ రాయల్స్​, దిల్లీ క్యాపిటల్స్​ జట్ల మధ్య మ్యాచ్​ ప్రారంభమయ్యింది. ఈ మ్యాచ్​లో దిల్లీ టాస్​​ గెలుచుకుంది.

IPL 2023 11th match Rajasthan Royals vs Delhi Capitals  toss
IPL 2023 11th match Rajasthan Royals vs Delhi Capitals toss

By

Published : Apr 8, 2023, 3:03 PM IST

Updated : Apr 8, 2023, 3:34 PM IST

IPL 2023 : ఇండియన్​ ప్రీమియర్ లీగ్​ 16 సీజన్​లో భాగంగా రాజస్థాన్​ రాయల్స్​, దిల్లీ క్యాపిటల్స్​ జట్ల మధ్య మ్యాచ్​ ప్రారంభమయ్యింది. ఈ క్రమంలో దిల్లీ​ జట్టు టాస్​ గెలిచింది. బౌలింగ్​​​ ఎంచుకుంది. ప్రత్యర్థి రాజస్థాన్​ జట్టుకు బ్యాటింగ్​ అప్పగించింది.

రాజస్థాన్ రాయల్స్ : సంజూ శాంసన్(కెప్టెన్​, వికెట్​ కీపర్), జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధృవ్ జురెల్, జేసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

దిల్లీ క్యాపిటల్స్ జట్టు : డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మనీశ్​ పాండే, రైలీ రూసో, అభిషేక్ పోరెల్, రావ్‌మెన్ పావెల్, లలిత్​ యాదవ్, అక్షర్ పటేల్, ఆన్రిచ్ నోర్యీ, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, ముకేశ్​ కుమార్

బ్యాటింగ్‌కు అనుకూలంగా అనిపిస్తోంది: సంజూ
బ్యాటింగ్‌ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా భారీ స్కోరు చూసే మ్యాచ్‌ అవుతుందని భావిస్తున్నా. ఇంపాక్ట్‌ రూల్‌ వల్ల బ్యాటింగ్‌, బౌలింగ్‌ను బ్యాలెన్స్‌ చేసుకోగలుగుతున్నాం. జోస్ బట్లర్‌ బాగానే ఉన్నాడు. అయితే, జట్టులో రెండు మార్పులు చేస్తున్నాం.

మిచెల్‌ మార్ష్‌కు శుభాకాంక్షలు..
టాస్‌ నెగ్గిన అనంతరం డేవిడ్ వార్నర్‌ మాట్లాడుతూ.. విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తాం. ప్రారంభం బాగుంటుందని ఆశిస్తున్నా. మిచెల్‌ మార్ష్ లేకుండా బరిలోకి దిగుతున్నాం. అతడు వివాహం చేసుకునేందుకు వెళ్లాడు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతున్నా.

దిల్లీ బోణీ కొట్టేనా..
ఈ మ్యాచ్‌లో దిల్లీ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఆడటం లేదు. అతడి పెళ్లికి సమయం దగ్గర పడుతున్న కారణంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. మార్ష్ లేకపోవడం వల్ల అతడి స్థానంలోకి రావ్‌మెన్ పావెల్ ఆడిస్తున్నారు. ఫినిషర్‌గా మంచి స్కిల్స్ చూపించిన పావెల్.. కనుక ఫామ్ అందుకొని, రెచ్చిపోతే ఎలాంటి టార్గెట్ అయినా చిన్నబోవాల్సిందే. అంతేకాకుండా అవసరమైతే పావెల్ కూడా బౌలింగ్ చేస్తాడు. మరేవైపు తన అరంగేట్ర మ్యాచ్‌లో అదరగొట్టిన వికెట్ కీపర్, బ్యాటర్ అభిషేక్ పోరెల్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం దొరికింది.

మినీ వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన బెంగాల్ పేసర్ ముకేశ్​ కుమార్.. ఈ ఐపీఎల్‌లో అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. అయితే ముకేశ్​ బదులు.. చేతన్ సకారియాను ఈ మ్యాచ్​ ఆడిస్తారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా జట్టు యాజమాన్యం ముకేశ్​ను జట్టులోకి తీసుంది. ఇక మరో ప్లేయర్​ అమన్ ఖాన్ కూడా గొప్పగా రాణించలేదు. దీంతో ఈ మ్యాచ్​లో అతడిని పక్కన పెట్టారు. అయితే ఆడిన రెండు మ్యాచ్​ల్లో ఓడిపోయిన దిల్లీ.. ఈ మ్యాచ్​తో అయినా బోణీ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

రాజస్థాన్​ మార్పుల పర్వం..
రాజస్థాన్ రాయల్స్, దిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్​.. ఐపీఎల్ చరిత్రలో 999వ మ్యాచ్​. ఇప్పటివరకు రెండు మ్యాచ్​లు ఆడిన రాజస్థాన్​ ఒకదాంట్లోనే గెలుపొందింది. ఈ మ్యాచ్​లో ఎలాగైన గెలిచి పాయింట్ల పట్టికలో స్థానం మెరుగుపరుచుకోవాలని ఆశిస్తోంది. రెండు మ్యాచుల్లో విఫలమైన దేవదత్ పడిక్కల్‌ను పక్కన పెట్టింది రాజస్థాన్ జట్టు. ఇక బౌలర్లలో.. కేఎమ్ ఆసిఫ్ పెద్దగా ఆకట్టుకోకపోగా.. దానికితోడు ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. దీంతో అతడిని ఈ మ్యాచ్‌లో జట్టులోకి తీసుకోలేదు

Last Updated : Apr 8, 2023, 3:34 PM IST

ABOUT THE AUTHOR

...view details