తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2022: చర్చంతా కోహ్లీ, ఆర్సీబీ గురించే.. నెటిజన్ల రచ్చ రచ్చ! - అత్యధిక ట్వీట్లు ఆర్సీబీ

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో​ తొలిసారి అడుగుపెట్టిన గుజరాత్​ టైటాన్స్.. 15వ సీజన్​​ కప్పును కొట్టేసింది. అయితే సోషల్​ మీడియాలో అత్యంత ప్రజాదరణ ఉన్న జట్టుగా మాత్రం స్థానం సంపాదించలేకపోయింది. ఈ సీజన్​లో క్వాలిఫయర్ ​2 మ్యాచ్​లో ఓటమిపాలై ఇంటి బాట పట్టిన బెంగళూరు జట్టుతో పాటు విరాట్​ కోహ్లీ గురించి నెటిజన్లు ఎక్కువగా చర్చించుకున్నారట. ఆ సంగతేంటో చూద్దాం రండి.

Virat Kohli
Virat Kohli

By

Published : Jun 2, 2022, 11:19 AM IST

IPL 2022 Social Media: రెండు నెలల పాటు క్రికెట్‌ ప్రేమికులను ఉర్రూతలూగించిన ఐపీఎల్​ 15వ సీజన్​లో గుజరాత్​ టైటాన్స్​ జట్టు విజేతగా​ నిలిచింది. లీగ్​లో అడుగుపెట్టిన తొలి సీజన్​లోనే ఫైనల్​ చేరి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన గుజరాత్​.. అదే ఊపులో అద్భుతంగా ఆడి కప్పును కూడా కొట్టేసింది. ఆరంభ సీజన్​లో టైటిల్ గెలిచాక ఇంత కాలానికి మళ్లీ ఫైనల్లో అడుగుపెట్టిన రాజస్థాన్​ రాయల్స్​కు నిరాశ ఎదురైంది.

అయితే హార్దిక్​ పాండ్య సారథ్యంలో గుజరాత్​ టైటాన్స్​ జట్టు.. టైటిల్​ను గెలుచుకుంది కానీ నెటిజన్ల హృదయాలను మాత్రం గెలుచుకోలేకపోయింది. అనూహ్యంగా ప్లేఆఫ్స్​ చేరిన బెంగళూరు జట్టు.. క్వాలిఫయర్- ​2 మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​ చేతిలో ఓటమిపాలై ఫ్యాన్స్​ను నిరాశపరిచింది. కానీ, ట్విట్టర్​లో మాత్రం అత్యంత ప్రజాదరణ పొందిన జట్టుగా నిలిచింది. అది తెలుసుకున్న అభిమానులు ఫుల్​ హ్యాపీగా ఫీలవుతున్నారు. ట్విట్టర్​లో ఆర్సీబీ జట్టుతో పాటు ఆ టీమ్​ మాజీ సారథి విరాట్​ కోహ్లీ గురించి నెటిజన్లు ఎక్కువగా చర్చించుకున్నారని ట్విట్టర్​ అధికారికంగా వెల్లడించింది.

2022 ఐపీఎల్​ సీజన్​లో ఆర్సీబీపై అత్యధికంగా ట్వీట్లు​ చేశారు నెటిజన్లు. బెంగళూరు తర్వాత స్థానాల్లో చెన్నై సూపర్​ కింగ్స్​, ముంబయి ఇండియన్స్​, కోల్​కతా నైట్​ రైడర్స్​, రాజస్థాన్​ రాయల్స్​ జట్లు నిలిచాయి. ఇక, నెటిజన్లు ఎక్కువగా చర్చించుకున్న ఆటగాళ్లలో మొదటి స్థానంలో విరాట్​ కోహ్లీ నిలవగా, తర్వాత స్థానాల్లో రోహిత్​ శర్మ, రవీంద్ర జడేజా, డుప్లెసిస్​ ఉన్నారు. కరోనా ఆంక్షల దృష్ట్యా ఆర్సీబీ.. బెంగళూరులో ఒక్క మ్యాచ్​ కూడా ఆడకపోయినప్పటికీ పూర్తి మద్దతుగా నిలిచారు అభిమానులు. వాంఖడే, ఈడెన్​ గార్డెన్స్​ వంటి మైదానాల్లో మ్యాచ్​ జరుగుతున్నంతసేపు విరాట్​ కోహ్లీ, ఆర్సీబీ అంటూ అరుస్తూ తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. దీని బట్టి చూస్తే ఆర్సీబీకి ఎంత ఫాలోయింగ్​ ఉందో తెలుస్తోంది.

ఇవీ చదవండి:'పతకాలతోనే మాట్లాడతా'.. డెఫ్‌లింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన షూటర్ శ్రీకాంత్

ధోనీ వల్ల రిటైరవ్వాలనుకున్నా.. సచిన్​ మధ్యలో వచ్చి..: సెహ్వాగ్

ABOUT THE AUTHOR

...view details