తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2022: రాజస్థాన్ రాజసం.. లఖ్​నవూపై విజయం - ఐపీఎల్​ 2022 న్యూస్

IPL 2022: ఐపీఎల్​ 2022లో భాగంగా లఖ్​నవూతో జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్​ విజయం సాధించింది. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్​నవూను 154 పరుగులకే కట్టడి చేసింది. దీంతో రాజస్ధాన్​ 24 పరుగుల తేడాతో గెలిచింది.

IPL 2022 rr vs lsg
IPL 2022 rr vs lsg

By

Published : May 15, 2022, 11:39 PM IST

IPL 2022: లఖ్‌నవూపై 24 పరుగుల తేడాతో రాజస్థాన్‌ గెలిచింది. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 154 పరుగులే చేసింది. దీపక్‌ హుడా (59) అర్ధశతకం సాధించాడు. కృనాల్ పాండ్య (25), మార్కస్ స్టొయినిస్ (27) ఫర్వాలేదనింపించారు. మిగతా బ్యాటర్లలో డికాక్ 7, కేఎల్ రాహుల్ 10, ఆయుష్ బదోని డకౌట్, జాసన్ హోల్డర్‌ 1, మోహ్‌సిన్‌ ఖాన్‌ 9* పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్‌ 2, ప్రసిధ్‌ కృష్ణ 2, మెక్‌కాయ్‌ 2.. చాహల్, అశ్విన్‌ చెరో వికెట్ తీశారు.

ఈ విజయంతో రాజస్థాన్‌ (16, +0.304) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. రన్‌రేట్‌ తగ్గడంతో లఖ్‌నవూ (16, +0.262) మూడో స్థానానికి పడిపోయింది. ఇక మిగిలిన జట్ల మ్యాచుల్లో అద్భుతాలు జరిగితే తప్పితే ఈ రెండు టీమ్‌లు దాదాపు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నట్లే.

తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. దీంతో లఖ్‌నవూకు 179 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. యశస్వి జైస్వాల్ 41, దేవదుత్ పడిక్కల్ 39, సంజూ శాంసన్‌ 32, రియాన్ పరాగ్ 17, నీషమ్‌ 14, అశ్విన్‌ 10*, ట్రెంట్ బౌల్ట్ 17* పరుగులు చేశారు. జోస్ బట్లర్‌ (2) విఫలమయ్యాడు. లఖ్‌నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్ 2.. అవేశ్‌ఖాన్, జాసన్ హోల్డర్‌, ఆయుష్ బదోని తలో వికెట్ తీశారు.

ఇదీ చదవండి:IPL 2022: సాహో సాహా, షమీ.. గుజరాత్​ చేతిలో చెన్నై ఓటమి

ABOUT THE AUTHOR

...view details