తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఓటముల్లో ముంబయి 'డబుల్​ హ్యాట్రిక్'.. టోర్నీ నుంచి ఔట్! - అవేశ్ ఖాన్

IPL 2022: శనివారం లఖ్​నవూతో జరిగిన మ్యాచ్​లో 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది ముంబయి ఇండియన్స్​. సెంచరీతో లఖ్​నవూ విజయంలో కీలకపాత్ర పోషించాడు కెప్టెన్ కేఎల్ రాహుల్.

mi vs lucknow
IPL 2022

By

Published : Apr 16, 2022, 7:34 PM IST

IPL 2022: ముంబయి ఇండియన్స్​ రాత మారలేదు. లీగ్​లో వరుసగా ఆరో మ్యాచ్​లోనూ ఓటమిపాలైంది. శనివారం లఖ్​నవూ చేతిలో 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ముంబయి.. 181/9కే పరిమితమైంది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (13), రోహిత్ శర్మ (6) మరోసారి విఫలమయ్యారు. బ్రెవిస్ (31) ఉన్నంతసేపు మెరిశాడు. సూర్యకుమార్ (37), తిలక్ వర్మ (26) రాణించారు. ఆఖర్లో పొలార్డ్ (25), ఉనద్కత్ (14) పోరాడారు. లఖ్​నవూ బౌలర్లలో అవేశ్​ ఖాన్ 3 వికెట్లతో సత్తాచాటాడు. హోల్డర్, రవి బిష్ణోయ్, స్టోయినిస్, చమీరా తలో వికెట్ తీశారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్​ దిగిన లఖ్​నవూ.. కెప్టెన్ కేఎల్ రాహుల్ శతకంతో చెలరేగడం వల్ల నిర్ణీత 20ఓవర్లలో199/4 పరుగులు చేసింది. మనీశ్ పాండే, క్వింటన్ డికాక్ ఫర్వాలేదనిపించారు. ముంబయి బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ రెండు వికెట్లు తీయగా.. మురుగన్ అశ్విన్, ఫేబియన్ అలెన్ చెరో వికెట్ పడగొట్టారు.

ABOUT THE AUTHOR

...view details