తెలంగాణ

telangana

ETV Bharat / sports

బ్యాటింగ్, బౌలింగ్​లో దిల్లీ భళా.. పంజాబ్ చిత్తు

IPL 2022: దిల్లీ క్యాపిటల్స్ అద్భుత ప్రదర్శన చేసింది. పంజాబ్ కింగ్స్​ను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. దిల్లీ బౌలర్లు సమష్టిగా రాణించారు. బ్యాటింగ్​లో వార్నర్, పృథ్వి షా ధాటిగా ఆడటం వల్ల ఒక వికెట్ నష్టపోయి సునాయాసంగా విజయం సాధించింది.

IPL 2022
IPL 2022

By

Published : Apr 20, 2022, 10:32 PM IST

Updated : Apr 20, 2022, 11:38 PM IST

IPL 2022: పంజాబ్‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ దిల్లీ బ్యాటర్లు చెలరేగిపోయారు. పంజాబ్‌ నిర్దేశించిన 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని దిల్లీ కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయి 10.3 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్‌ డేవిడ్ వార్నర్ (60*), పృథ్వీ షా (41) తొలి వికెట్‌కు 6.3 ఓవర్లలో 83 పరుగులు జోడించారు. పృథ్వీ షా ఔటైనప్పటికీ సర్ఫరాజ్‌ ఖాన్‌ (12*)తో కలిసి వార్నర్‌ మరో వికెట్‌ పడనీయకుండా జట్టును విజయతీరానికి చేర్చాడు. దీంతో పాయింట్ల పట్టికలో దిల్లీ (6) ఆరో స్థానానికి ఎగబాకింది. ఈ సీజన్‌లో పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు (81/0) దిల్లీదే కావడం విశేషం.

ఆరంభం నుంచే దూకుడు.. తొలి ఓవర్‌నే పృథ్వీ షా (26*) దంచేశాడు. పంజాబ్‌ బౌలర్‌ వైభవ్ అరోరా వేసిన ఓవర్‌లో మూడు ఫోర్లను బాదాడు. 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ మూడు ఓవర్లు ముగిసేసరికి 43 పరుగులు చేసింది. క్రీజ్‌లో పృథ్వీ షాతో పాటు డేవిడ్ వార్నర్ (16*) ఉన్నాడు. దిల్లీ విజయానికి ఇంకా 73 పరుగులు చేసింది.

కుప్పకూలిన పంజాబ్‌.. దిల్లీ బౌలర్లు విజృంభించారు. పంజాబ్‌ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. దీంతో దిల్లీ ఎదుట 116 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంచింది. జితేశ్‌ శర్మ (32), మయాంక్‌ అగర్వాల్ (24), షారుఖ్‌ ఖాన్ (12) మినహా ఎవరూ రెండంకెల స్కోరు చేయలేదు. దిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2, అక్షర్‌ 2, కుల్‌దీప్‌ 2, లలిత్ యాదవ్ 2, ముస్తాఫిజర్‌ చెరో వికెట్ తీశారు.

కష్టాల్లో పంజాబ్‌.. పంజాబ్‌ కష్టాల్లో పడింది. కీలక వికెట్లు కోల్పోవడంతో పరుగులు రావడం గగనమైంది. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి ఎనిమిది వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. క్రీజ్‌లో రాహుల్ చాహర్ (1*), అర్ష్‌దీప్‌(4*) ఉన్నారు. దిల్లీ బౌలర్లు చెలరేగడంతో స్వల్ప వ్యవధుల్లో పంజాబ్‌ వికెట్లను చేజార్చుకుంది.

జితేశ్‌ శర్మ ఆదుకునే ప్రయత్నం.. దిల్లీ బౌలర్ల దెబ్బకు స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోయిన పంజాబ్‌ను జితేశ్‌ శర్మ (28*) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. జితేశ్‌కు తోడుగా షారుఖ్‌ ఖాన్‌ (3*) క్రీజ్‌లో ఉంటూ నిదానంగా ఆడుతున్నాడు. ప్రస్తుతం పది ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ నాలుగు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.

పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్‌ మూడు కీలక వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్ (24), శిఖర్ ధావన్‌ (9)తోపాటు మంచి ఫామ్‌లో ఉన్న లియామ్‌ లివింగ్‌స్టోన్ (2) ఔటయ్యారు. ముస్తాఫిజర్‌ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ క్లీన్‌ బౌల్డ్‌ కాగా.. లియామ్‌ లివింగ్‌ స్టోన్‌ను అక్షర్‌ బోల్తా కొట్టించాడు. షాట్‌ ఆడేందుకు క్రీజ్‌ వదిలి ముందుకొచ్చిన లివింగ్‌స్టోన్‌ను కీపర్‌ రిషభ్ పంత్ స్టంప్‌ చేశాడు. లలిత్‌ యాదవ్ బౌలింగ్‌లో కీపర్‌ పంత్‌కే క్యాచ్‌ ఇచ్చి ధావన్‌ పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం పంజాబ్‌ 6 ఓవర్లు పూర్తయ్యేసరికి మూడు వికెట్ల నష్టానకి 47 పరుగులు చేసింది. క్రీజ్‌లో జితేశ్‌ శర్మ (1*), బెయిర్‌స్టో (9*) ఉన్నారు.

ఆచితూచి ఆడుతూ.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ ఆచితూచి ఆడుతోంది. ప్రస్తుతం మూడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. క్రీజ్‌లో మయాంక్‌ అగర్వాల్ (22*), శిఖర్‌ ధావన్‌ (3*) ఉన్నారు. దిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో తొలి రెండు ఓవర్లను నిదానంగా ఆడిన పంజాబ్‌ బ్యాటర్లు మూడో ఓవర్‌లో మాత్రం దూకుడు పెంచారు. మయాంక్‌ అగర్వాల్ వేగంగా పరుగులు చేస్తుండగా.. ధావన్‌ మాత్రం మెల్లగా ఆడుతూ కెప్టెన్‌కు స్ట్రైక్‌ ఇస్తున్నాడు.

సందిగ్ధతకు తెర.. దిల్లీ జట్టులో కరోనా కేసుల నేపథ్యంలో టీ20 లీగ్‌ మ్యాచ్‌ నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. దిల్లీ, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్‌ నిర్వహించేందుకే బీసీసీఐ మొగ్గు చూపింది. మరికాసేపట్లో బ్రాబౌర్నే మైదానం వేదికగా మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్‌ నెగ్గిన దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్ బౌలింగ్‌ ఎంచుకుని పంజాబ్‌కి బ్యాటింగ్ అప్పగించాడు. ప్రస్తుతం దిల్లీ (4) ఐదు మ్యాచులకుగాను రెండు విజయాలు, మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. పంజాబ్‌ (6) మూడు విజయాలు, మూడు పరాజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతోంది.

ఇదీ చూడండి :అంతర్జాతీయ క్రికెట్​కు విండీస్ స్టార్ క్రికెటర్ వీడ్కోలు

Last Updated : Apr 20, 2022, 11:38 PM IST

ABOUT THE AUTHOR

...view details