DRS For Wides: ప్రస్తుతం జరుగుతున్న టీ20 లీగ్‌లో అంపైర్ల నిర్ణయాలపై చర్చ కొనసాగుతూనే ఉంది. వైడ్లు, నోబాల్ వంటి వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. బెంగళూరు మాజీ కోచ్ డానియల్ వెటోరి 'వైడ్ల' అంశంపై స్పందించాడు. రాజస్థాన్, కోల్‌కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వివాదస్పదంగా మారిన వైడ్ల ప్రకటనతో సంజూ శాంసన్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఈ క్రమంలో క్లిష్టమైన వైడ్ల నిర్ణయాన్ని డీఆర్‌ఎస్ వినియోగించి తేల్చాలని బెంగళూరు మాజీ కెప్టెన్ డానియల్ వెటోరి సూచించాడు.
Daniel Vettori drs wides: "వైడ్స్ కోసం ఆటగాళ్లు రివ్యూకు వెళ్లేందుకు అనుమతినివ్వాలి. ఇటువంటి క్లిష్టమైన విషయాల్లో ఆటగాళ్లకు స్వేచ్ఛ ఉండాల్సిందే. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించింది. అయితే చాలాసార్లు అంపైర్ల నిర్ణయాలు బౌలర్లకు వ్యతిరేకంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా వైడ్ల విషయంలో కొన్ని తప్పులు జరిగాయని అనిపిస్తుంది. అందుకే వాటిని సరిదిద్దాలి. క్లిష్టమైన వైడ్ల నిర్ణయంపై డీఆర్‌ఎస్‌కు వెళ్లేందుకు అవకాశం ఇస్తే బాగుంటుంది" అని వెటోరి వివరించాడు.