ఐపీఎల్ వాయిదా.. నెట్టింట సందడి చేస్తున్న మీమ్స్ - ఐపీఎల్ 2021 వాయిదాపై సన్‌రైజర్స్ మీమ్స్
ఐపీఎల్ సజావుగా సాగుతుందన్న సమయంలో బయోబబుల్‌లో ఉన్న ఆటగాళ్లకు పాజిటివ్ రావడం వల్ల లీగ్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో మీమ్స్‌తో సందడి చేస్తున్నారు నెటిజన్లు.
కరోనా మహమ్మారి ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌గా గుర్తింపు పొందిన ఐపీఎల్‌నూ వదలలేదు. బయోబబుల్ లాంటి సురక్షిత వాతావారణం సృష్టించిన తర్వాత కూడా ఆటగాళ్లు కరోనా బారిన పడటం నిర్వాహకుల్ని ఆందోళనకు గురిచేసింది. దీంతో టోర్నీని వాయిదా వేసింది బీసీసీఐ. భారత్‌లో కేసులు పెరగడం, మైదాన సిబ్బందికి కరోనా సోకడం, ఆటగాళ్లకు పాజిటివ్ రావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఆర్సీబీ, సన్‌రైజర్స్‌కు సంబంధించిన మీమ్స్ నవ్వులు తెప్పిస్తున్నాయి.