ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌కు దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఈ సీజన్లో తొలిసారిగా ఆతిథ్యమివ్వనుంది. ఒకవైపు వరుస విజయాలతో టాప్-2లో ఉన్న చెన్నై జట్టు.. మరొకటి వరుస పరాజయాలతో చిట్టచివరి స్థానంలో ఉన్న హైదరాబాద్ టీమ్. ఇరుజట్లలో చెన్నై జట్టు అన్ని విభాగాల్లోనూ దుర్భేద్యంగా కనిపిస్తోంది. మరి ఈ మ్యాచ్‌లోనైనా వార్నర్ సేన గట్టెక్కుతుందేమో చూడాలి.
వరుస విజయాలతో చెన్నై..
సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్.. తర్వాత జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి ఊపుమీదుంది. గత సీజన్లో ప్లే ఆఫ్స్ చేరడంలో విఫలమైన ఈ జట్టు ఈ సారి 'ఛాంపియన్ చెన్నై'ని గుర్తుకు తెస్తోంది. బెంగళూరుతో జరిగిన గత మ్యాచ్‌లో జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. ఇక బ్యాటింగ్‌లో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు డుప్లెసిస్ అద్భుతంగా ఆడుతున్నారు. మూడో స్థానానికి ప్రమోట్ అయిన మొయిన్ అలీ మంచి ప్రదర్శన చేస్తున్నాడు. వీరితో పాటు రైనా, ధోనీ మంచి ఫామ్‌లో ఉన్నారు.
బౌలింగ్‌లో దీపక్ చాహర్ ప్రత్యర్థిని మొదటి పవర్‌ప్లేలోనే దెబ్బకొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మరో పేసర్ శార్దుల్ ఠాకుర్ కూడా మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, మొయిన్ అలీ స్పిన్ ద్వయం కీలకమైన వికెట్లను తీసి ప్రత్యర్థిని గట్టి దెబ్బ కొట్టింది.