సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వార్నర్‌ను తప్పించడాన్ని కివీస్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ డల్ ప్రశ్నించాడు. ఫ్రాంచైజీతో అతడికి కచ్చితంగా విభేదాలు వచ్చే ఉంటాయని అభిప్రాయపడ్డాడు. జట్టు కోచింగ్ బృందం కూర్పు బాగాలేదని అన్నాడు. వార్నర్ స్థానంలో విలియమ్సన్కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తూ మే 1న సన్‌రైజర్స్ నిర్ణయం తీసుకుంది.
"జట్టుతో కాకుండా జట్టు యాజమాన్యంతో కచ్చితంగా ఎక్కడో విభేదాలు వచ్చాయనే అనిపిస్తోంది. మనీశ్ పాండేను తుది జట్టులోంచి తప్పించడంపై వార్నర్ మాట్లాడాడంటే కోచింగ్ కూర్పులోనే ఇబ్బంది కనిపిస్తోంది. ఎందుకంటే అది అతడి నిర్ణయం కాదని స్పష్టంగా తెలుస్తోంది. అయితే నిర్ణయం ఒకరిదైతే మూల్యం చెల్లిస్తోంది మరొకరని అర్థమవుతోంది. హైదరాబాద్ కోచింగ్ కూర్పు సరిగ్గా లేదు. వారి చర్యలు బాగాలేవు. మొదట కోచ్ టామ్ మూడీని తొలగించారు. ట్రెవర్ బేలిస్‌ను తీసుకొచ్చారు. మళ్లీ క్రికెట్ డైరెక్టర్‌గా మూడీని నియమించారు. ఆ చర్య ఎలా పనిచేస్తుందో అర్థం కాలేదు. 6 మ్యాచుల్లో ఒక్కటే గెలవడం చూస్తుంటే వారి సంబంధాలు పనిచేయడం లేదనే అనిపిస్తోంది. వార్నర్ ఆడటం కష్టమేనని వారి ప్రకటన ద్వారా తెలుస్తోంది. అది మరింత విచిత్రంగా అనిపించింది" అని డల్ పేర్కొన్నాడు.