కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతోన్న క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ ఓ మోస్తరు పరుగులకే పరిమితమైంది. కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(36) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ (30 నాటౌట్) పరుగులతో ఆకట్టుకున్నాడు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు.. శివమ్ మావి, లాకీ ఫెర్గూసన్ తలో వికెట్ తీశారు.
చేతులెత్తేసిన దిల్లీ బ్యాట్స్‌మెన్.. కోల్‌కతా ముందు స్వల్పలక్ష్యం
ఐపీఎల్ క్వాలిఫయర్స్-2 మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. కోల్‌కతా బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 135 పరుగులతో సరిపెట్టుకున్నారు. దీంతో కోల్‌కతా ముందు 136 పరుగుల స్వల్పలక్ష్యం బరిలో దిగనుంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ క్యాపిటల్స్ ఆరంభం నుంచి నిలకడగానే ఆడింది. ఓపెనర్ పృథ్వీ షా(18) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. వరుణ్ చక్రవర్తి వేసిన ఐదో ఓవర్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టొయినిస్(18).. మరో ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే శివమ్ మావి వేసిన 12వ ఓవర్లో బౌల్డై పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే ధావన్ కూడా వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో షకిబ్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్ రిషభ్ పంత్(6) విఫలమయ్యాడు. ఆఖర్లో వచ్చిన షిమ్రోన్ హెట్‌మైర్(17) దూకుడుగా ఆడాడు. అక్షర్ పటేల్(4) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఇదీ చూడండి..IPL 2021 Qualifier 2: టాస్ గెలిచిన కోల్‌కతా.. దిల్లీ బ్యాటింగ్