తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​: ముంబయిపై పంజాబ్​ సమష్టి విజయం

చెన్నై వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్​లో పంజాబ్​ కింగ్స్​ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ కేఎల్ రాహుల్​ హాఫ్ సెంచరీతో మెరిశాడు.

punjab kings vs mumbai indians, k l rahul
పంజాబ్​ కింగ్స్​ vs ముంబయి ఇండియన్స్, కేఎల్ రాహుల్

By

Published : Apr 23, 2021, 10:59 PM IST

Updated : Apr 23, 2021, 11:06 PM IST

ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఘన విజయం సాధించింది. రోహిత్‌సేన నిర్దేశించిన 132 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పంజాబ్‌ 17.4 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(60; 52 బంతుల్లో 3x4, 3x6) అర్ధశతకంతో మెరవగా క్రిస్‌గేల్‌(43; 35 బంతుల్లో 5x4, 2x6) తనవంతు పరుగులు చేశాడు. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(25; 20 బంతుల్లో 4x4, 1x6) ధాటిగా ఆడే క్రమంలో రాహుల్‌ చాహర్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌లో ఔటయ్యాడు. అప్పటికి ఓపెనర్లు ఇద్దరూ 53 పరుగులు చేసి పంజాబ్‌కు శుభారంభం ఇచ్చారు.

తడబడిన ముంబయి

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులే చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(63; 52 బంతుల్లో 5x4, 2x6), సూర్యకుమార్‌ యాదవ్‌(33; 27 బంతుల్లో 3x4, 1x6) రాణించడం వల్ల ఆ మాత్రం స్కోరైనా సాధించింది. ఓపెనర్‌ డికాక్‌(3), ఇషాన్‌ కిషన్‌(6) పూర్తిగా విఫలమయ్యారు. దాంతో 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ముంబయిని రోహిత్‌, సూర్య ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. అయితే చివర్లో ధాటిగా ఆడే క్రమంలో వరుస ఓవర్లలో పెవిలియన్‌ చేరారు. పొలార్డ్‌(16 నాటౌట్)గా నిలిచాడు. హార్దిక్‌ పాండ్యా(1), కృనాల్‌ పాండ్యా(3) ఆకట్టుకోలేకపోయారు. పంజాబ్‌ బౌలర్లలో షమీ, బిష్ణోయ్‌ చెరో రెండు వికెట్లు తీయగా దీపక్‌ హుడా, అర్ష్‌దీప్‌ సింగ్‌ తలో వికెట్‌ తీశారు.

Last Updated : Apr 23, 2021, 11:06 PM IST

ABOUT THE AUTHOR

...view details