తెలంగాణ

telangana

ETV Bharat / sports

సమష్టిగా రాణించిన​ బౌలర్లు.. కోల్​కతా లక్ష్యం 124

అహ్మదాబాద్ వేదికగా కోల్​కతా-పంజాబ్​ మధ్య జరుగుతోన్న మ్యాచ్​లో రాహుల్​ సేన నిర్ణీత ఓవర్లలో 123 పరుగులు చేసింది. కేకేఆర్​ బౌలర్లు సమష్టిగా రాణించారు. వారి ధాటికి పంజాబ్​ బ్యాట్స్​మెన్​ వేగంగా ఆడలేక స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు.

punjab vs kolkata match, innings break
కోల్​కతా vs పంజాబ్, ఇయాన్ మోర్గాన్, కేఎల్ రాహుల్

By

Published : Apr 26, 2021, 9:18 PM IST

అహ్మదాబాద్ వేదికగా కోల్​కతాతో జరుగుతోన్న మ్యాచ్​లో పంజాబ్​ 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్​(34 బంతుల్లో 31 పరుగులు), రాహుల్(20 బంతుల్లో 19 పరుగులు), పూరన్(19 బంతుల్లో 19 పరుగులు) రాణించలేకపోయారు. కేకేఆర్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 3, నరైన్, కమిన్స్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు.

ఇదీ చదవండి:'బయట భయానకం.. బబుల్​లోనే సురక్షితం'

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన పంజాబ్​ ఆది నుంచి నెమ్మదిగా ఆడింది. ఓపెనర్లు రాహుల్​-అగర్వాల్ తొలి వికెట్​కు 36 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్​ ఆరో ఓవర్లో రాహుల్​ను ఔట్​ చేయడం ద్వారా కేకేఆర్​కు తొలి వికెట్ అందించాడు కమిన్స్​. తర్వాత ఓవర్లోనే ప్రమాదకర గేల్ డకౌట్​గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్​మెన్ ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. చివర్లో క్రిస్ జోర్డాన్(18 బంతుల్లో 30 పరుగులు)​ కాస్త వేగంగా ఆడాడు. దీంతో పంజాబ్​ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

ఇదీ చదవండి:హాకీ కెప్టెన్ రాణి రాంపాల్​తో సహా ఏడుగురికి కరోనా

ABOUT THE AUTHOR

...view details