ఐపీఎల్ 2021లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవడమే లక్ష్యంగా నేడు (సెప్టెంబర్ 29) రాజస్థాన్ రాయల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది.
ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. టాప్-4 రేసులో ఆర్సీబీ కాస్త ముందుండగా.. రాజస్థాన్ ఆడే ప్రతి మ్యాచ్లోనూ గెలవాల్సిన పరిస్థితి.
ఫేస్ టూ ఫేస్
ఇప్పటివరకు ఈ రెండు జట్లు 23 మ్యాచ్ల్లో తలపడగా ఆర్సీబీ 11, రాజస్థాన్ 10 మ్యాచ్ల్లో గెలిచాయి.