దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. వార్నర్, మనీష్ పాండే అర్ధ సెంచరీలతో రాణించారు.
రాణించిన మనీష్, వార్నర్.. చెన్నై లక్ష్యం 172
దిల్లీ వేదికగా చెన్నైతో జరుగుతోన్న మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్‌మెన్‌లో వార్నర్, మనీష్ పాండే.. అర్ధ సెంచరీలతో రాణించారు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు వార్నర్, బెయిర్‌స్టో తొలి వికెట్‌కు 22 పరుగులు జోడించింది. గత మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసిన బెయిర్ స్టోను ఔట్ చేసిన సామ్ కరన్.. చెన్నైకి తొలి వికెట్ అందించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే(46 బంతుల్లో 61 పరుగులు).. కెప్టెన్ వార్నర్ (55 బంతుల్లో 57 పరుగులు)కు సహకరించాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ క్రమంలో వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 18వ ఓవర్లో బౌలింగ్‌కు దిగిన ఎంగిడి.. ఒకే ఓవర్లో వార్నర్, మనీష్‌లను పెవిలియన్ పంపాడు. చివర్లో విలియమ్సన్, కేదార్ జాదవ్ దంచికొట్టడం వల్ల సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 171 పరుగులు చేసింది.