అహ్మదాబాద్ వేదికగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మన్ తడబడ్డారు. తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్న మయాంక్ అగర్వాల్(99*) ఒక్క పరుగుతో సెంచరీ మిస్సయ్యాడు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టానికి 166 పరుగులు చేసింది పంజాబ్. దిల్లీ బౌలర్లలో రబాడా 3, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్ తలో వికెట్ తీశారు.
మయాంక్ సెంచరీ మిస్.. దిల్లీ లక్ష్యం 167
దిల్లీ క్యాపిటల్స్‌కు 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది పంజాబ్ కింగ్స్. మయాంక్ అగర్వాల్(99) కొద్దిలో శతకం మిస్సయ్యాడు. దిల్లీ బౌలర్లలో రబాడా 3 వికెట్లు తీశాడు.
మయాంక్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ ప్రభ్సిమ్రాన్(12) నాలుగో ఓవర్లో తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్రిస్ గేల్(13), డేవిడ్ మలన్(26), దీపక్ హోడా(1), షారుక్ ఖాన్(4), క్రిస్ జోర్డాన్(2) వరుసగా విఫలమయ్యారు. మరో ఓపెనర్ మయాంక్(99) చివరి దాకా క్రీజులో నాటౌట్‌గా నిలిచి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు.