దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సీఎస్కే బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్లు రుతురాజ్-డుప్లెసిస్.. హాఫ్ సెంచరీలతో రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు తీసుకున్నాడు.
172 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నైకి అదిరిపోయే ఆరంభం లభించింది. తొలి వికెట్‌కు 129 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసింది గైక్వాడ్-డుప్లెసిస్ జోడీ. దాదాపు 10 రన్‌రేట్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరి జోరు చూస్తే వికెట్ కోల్పోకుండానే సీఎస్కే విజయాన్ని సాధిస్తుందా అని భావించారంతా. కానీ, అద్భుతమైన బంతితో రుతురాజ్ (44 బంతుల్లో 75 పరుగులు)ను క్లీన్ బౌల్డ్ చేశాడు రషీద్ ఖాన్. సన్‌రైజర్స్‌కు తొలి వికెట్‌ను అందించాడు. తర్వాత కాసేపటికే మొయిన్ అలీతో పాటు డుప్లెసిస్ (38 బంతుల్లో 56 పరుగులు)ను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు రషీద్. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రైనా-జడేజా మిగిలిన పని పూర్తి చేశారు.