కరోనా వల్ల నిరవధిక వాయిదా పడ్డ ఐపీఎల్-14ను ఈ ఏడాది సెప్టెంబరులో కొనసాగిస్తారని సమాచారం. అయితే ఈ మెగా లీగ్ రెండో దశకు ఆతిథ్యమిచ్చేందుకు ఇంగ్లీష్ కౌంటీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగా మిడిల్సెక్స్, సర్రే, వార్విక్షైర్, లాంకాషైర్ కలిసి.. బీసీసీఐకి తమ విన్నపాన్ని అందించాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు లేఖ పంపాయి.
కొద్దిరోజుల్లో వర్చువల్గా జరగబోయే ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఈ విషయం గురించి బీసీసీఐ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు చర్చించుకోనున్నట్లు తెలుస్తోంది.