తెలంగాణ

telangana

ETV Bharat / sports

Women's IPL: మహిళల ఐపీఎల్ డౌటే.. టాలెంట్​ లేదనే కారణంతో! - సౌరవ్ గంగూలీ

Women's IPL from 2023 Looks Uncertain: పురుషులకు దీటుగా 2023 నుంచి మహిళల ఐపీఎల్ నిర్వహిస్తామని ఫిబ్రవరిలో బీసీసీఐ చీఫ్ గంగూలీ ప్రకటించారు. అయితే మహిళా క్రికెట్​లో తగినంత మంది ప్రతిభావంతులు లేరనే కారణంగా.. అది సాధ్యపడకపోవచ్చని బోర్డులోని ఓ వర్గం భావిస్తున్నట్లు సమాచారం.

BCCI
Women's IPL

By

Published : Apr 12, 2022, 7:56 PM IST

Women's IPL from 2023 Looks Uncertain: వచ్చే ఏడాది నుంచి మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్​ (ఐపీఎల్​)​ జరుగుతుందనుకున్న క్రికెట్ అభిమానులకు చేదు వార్త! 2023 నుంచే మహిళల ఐపీఎల్ ప్రారంభించాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆశిస్తుండగా, నాణ్యమైన ప్లేయర్లు లేని కారణంగా అది సాధ్యపడకపోవచ్చని బోర్డులోని ఓ వర్గం అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

"మహిళల క్రికెట్​ను ప్రోత్సాహించేందుకు బీసీసీఐ తగినంత కృషి చేస్తోంది. అయితే మహిళల క్రికెట్​లో ప్రతిభావంతుల కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతానికి మహిళల లీగ్​ ప్రారంభించడం అసాధ్యంగా కనబడుతోంది"

-ఓ బీసీసీఐ అధికారి

ఐపీఎల్​ తరహా లీగ్​లకు కనీసం నాలుగైదు జట్లు కావాలని సదరు బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. "ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లతో 4-5 నాణ్యమైన జట్లను తయారు చేయడం కష్టం. పురుషుల క్రికెట్​లో ఉన్న టాలెంట్​ స్థాయికి చేరాలంటే ఏళ్లు పడుతుంది. కొన్నేళ్లుగా మహిళల క్రికెట్​.. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎక్కువ మంది ప్లేయర్లను అందించలేకపోయింది. పురుషుల జట్లులో చూస్తే ఒకరి స్థానాన్ని భర్తీ చేసేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు. కానీ, మహిళల క్రికెట్​లో తగినంత మంది నాణ్యమైన ఆటగాళ్లు లేరు." అని ఆ అధికారి అన్నారు. ఉదాహరణకు రిటైర్మెంట్​కు దగ్గర్లో ఉన్న ఝులన్ గోస్వామి స్థాయిలో ప్రతిభ ఉన్న ప్లేయర్​ మనకు ఇప్పటివరకు లేరని చెప్పారు.

ఇదీ చూడండి:మహిళల ఐపీఎల్​పై గంగూలీ క్లారిటీ.. 'అప్పుడైతేనే కరెక్ట్​'

ABOUT THE AUTHOR

...view details