తెలంగాణ

telangana

ETV Bharat / sports

మిశ్రా మాయ.. దిల్లీ జీత్​గయా.. - ఐపీఎల్​ వార్తలు

Delhi Capitals won by 6 wkts
మిశ్రా మాయ.. దిల్లీ జీత్​గయా..

By

Published : Apr 20, 2021, 11:28 PM IST

Updated : Apr 21, 2021, 1:29 AM IST

23:06 April 20

మిశ్రా మాయ.. దిల్లీ జీత్​గయా..

ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. ముంబయి విధించిన 138 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ పృథ్వీ షా విఫలమైనా.. శిఖర్‌ ధావన్‌(45: 42 బంతుల్లో 5x4 1x6),స్టీవ్‌ స్మిత్‌ (33: 29 బంతుల్లో 4x4) రాణించడంతో దిల్లీ గెలుపుబాట పట్టింది.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగులు మాత్రమే చేసింది. దిల్లీ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా అద్భుత ప్రదర్శనతో 4 వికెట్లు తీసి ముంబయి నడ్డివిరిచాడు. ముంబయి జట్టులో కెప్టెన్‌ రోహిత్‌శర్మ (44; 30 బంతుల్లో 3x4, 3x6) ఒక్కడే రాణించడంతో ఆమాత్రం స్కోరైనా చేసింది. 

Last Updated : Apr 21, 2021, 1:29 AM IST

ABOUT THE AUTHOR

...view details