MS Dhoni: పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా వాటిని తట్టుకొని నిలబడి 'తగ్గేదేలే' అని థియేటర్లలో ఈలలు వేయించాడు ప్రముఖ టాలీవుడ్ హీరో అల్లుఅర్జున్. ఇప్పుడు వయసు పైబడినా.. ఒత్తిడి చిత్తు చేస్తున్నా.. ముంబయితో మ్యాచ్‌లో తాను ఇంకా 'తగ్గేదేలే' అని నిరూపించుకున్నాడు చెన్నై మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ. ఈ టీ20లీగ్‌లో రెండు గొప్ప జట్ల మధ్య గతరాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో మహీ ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉంటూ తన పని తాను చేసుకుపోయాడు. చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరమైన వేళ మరోసారి తనలోని అత్యుత్తమ ఫినిషర్‌ను బయటకుతీశాడు. ఈ క్రమంలోనే చివరి బంతికి బౌండరీ బాది చెన్నైని గట్టెక్కించాడు.
ధోనీ 'ఫినిష్' అనుకున్నావా.. ఫినిషర్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ - మహేంద్ర సింగ్ ధోనీ న్యూస్
MS Dhoni: ముంబయి ఇండియన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌తో తాను ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్ అని మరోసారి నిరూపించుకున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. దీంతో అభిమానులు, మాజీ క్రికెటర్లు ధోనీ ఆటకు ముగ్ధులైపోయారు. ఈ నేపథ్యంలోనే చెన్నై జట్టు మాజీ సారథి ధోనీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాడు.
ఈ మ్యాచ్‌కు ముందు మహీ ఆఖరి ఓవర్లలో 28 సార్లు బ్యాటింగ్ చేసి మొత్తం 250 పరుగులు చేశాడు. అందులో 35.71 సగటు, 287.35 స్ట్రైక్‌రేట్‌తో 23 సిక్సర్లు బాదాడు. దీంతో ఇప్పటికీ నంబర్ వన్ ఫినిషర్‌గా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ముంబయిపై గెలిచాక.. మహీ ఆటతీరుకు పలువురు క్రికెట్ ప్రముఖులతో పాటు అభిమానులు ఫిదా అయ్యారు. అతడు ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ బ్యాట్స్‌మన్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో చెన్నై మాజీ సారథి పేరు మార్మోగిపోతూ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
- ఎంఎస్ ధోనీ.. ఓం ఫినీషాయ నమహః. చెన్నైది ఏం గెలుపు ఇది! చాలా అద్భుతంగా ఉంది. - వీరేంద్ర సెహ్వాగ్
- ఇది ధోనీ ఆట.. చెన్నై మాజీ సారథి ఫైర్ మీదున్నాడు. - హర్భజన్ సింగ్
- ధోనీ ఫినిష్ కాలేదు.. ఇంకా ఫినిషర్‌గా ఉన్నాడు. మరోసారి నాటౌట్‌గా నిలిచాడు. సినిమా ఇంకా చాలా చాలా మిగిలుంది. - మహ్మద్ కైఫ్
- ఈ సీజన్‌లో అత్యంత ఎదురుచూసిన మ్యాచ్ ఇదే. ఆఖర్లో ధోనీ నుంచి మనం ఎప్పుడూ ఆశించే ఇన్నింగ్స్ ఇది. ఎప్పుడు చూసినా అతడి బ్యాటింగ్ కన్నులపండుగే. - సురేశ్ రైనా
- ధోనీ కాలాన్ని వెనక్కి తీసుకెళ్లి తన పాత రోజుల్ని గుర్తుచేశాడు. - ఇర్ఫాన్ పఠాన్
- ఆ ఫినిషర్ పేరే ఎంఎస్ ధోనీ. - కెవిన్ పీటర్సన్
- మహేంద్ర సింగ్ ధోనీ.. ది ఫినిషర్ ఆన్ ఫైర్. - రషీద్ ఖాన్
ఇదీ చదవండి:ధోనీపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. వేలెత్తి చూపలేమంటూ..