WTC Final 2023 : టీమ్ఇండియా ఆడబోయే ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సమయం ఆసన్నమైంది. ఈ ఫైనల్ పోరుకు బీసీసీఐ జట్టును ప్రకటించినప్పుడు అంతబాగానే ఉంది. కానీ ప్లేయర్లు వరుసగా గాయాల బారిన పడుతుండటం వల్ల పరిస్థితులు మారాయి. గత డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన టీమ్ఇండియా.. ఈ సారి మాత్రం కప్పు కొట్టాలని కసితో ఉంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితులతో అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. అందులో ముఖ్యంగా బౌలింగ్ విభాగం సమర్థతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గాయం కారణంగా ఇప్పటికే స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరమయ్యాడు. ఇక, శార్దూల్ ఠాకూర్ ఫామ్ అంతంతమాత్రంగానే ఉంది. మరోవైపు, జయదేవ్ ఉనద్కత్ కూడా జట్టులో కొనసాగుతాడో లేదో అన్న ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి తీసుకుంటే ఎలా ఉంటందనే చర్చ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 16న సీజన్లో భువీ మంచి ప్రదర్శన కనబరిచాడు. సోమవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి అదరగొట్టాడు.
Bhuvneshwar Kumar WTC Final : ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓడిపోయినప్పటికీ.. భువీని మెచ్చుకున్నాడు మాజీ టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. ఇంగ్లాండ్ పిచ్‌లపై అద్భుతాలు సృష్టించే సత్తా ఈ స్వింగ్ సుల్తాన్‌కు ఉందని అభిప్రాయపడ్డారు. అయితే, బీసీసీఐ సెలక్షన్ కమిటీ అతడికి అవకాశం ఇవ్వడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంగ్లాండ్ లాంటి వెదర్ కండిషన్లో భువీ బాగా ఆడతాడని, తన స్వింగ్ బౌలింగ్‌తో మాయ చేయగలడని నెటిజన్లు అంటున్నారు. అతడిని జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐని కోరుతూ కామెంట్లు పెడుతున్నారు.
అయితే, భువీ చాలా రోజులుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. భువీ చివరగా 2018లో టీమ్ఇండియా తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడాడు. జనవరి 20022లో వన్డే.. అదే ఏడాది నవంబర్‌లో భారత్ తరఫున ఇంటర్నేషనల్ టీ20 ఆడాడు. దీనికి తోడు మార్చిలో బీసీసీఐ విడుదల చేసిన వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో ఈ స్వింగ్ సుల్తాన్‌కు చోటు దక్కలేదు. ఈ క్రమంలో భువీని జట్టులోకి తీసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. కానీ అత్యవసర పరిస్థితుల్లో తీసుకునే అవకాశం ఉంది.
ట్విట్టర్లో అభిమానుల కామెంట్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమ్ఇండియా జట్టు:
wtc final team india squad 2023 : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, సిరాజ్, షమి, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.