తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023 : రిజర్వ్​ డే ఫైనల్​ మ్యాచ్​.. వాతావరణ పరిస్థితి ఎలా ఉందంటే?

Weather In Amedabad : టోర్నమెంట్ లీగ్ టాప్ రెండు జట్ల మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్​ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడింది. మరి సోమవారం మ్యాచ్ సమయానికి వాతావరణం ఎలా ఉండనుందంటే..

IPL 2023 Final Match Reserve Day
ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డే

By

Published : May 29, 2023, 3:44 PM IST

Weather In Amedabad : ప్రేక్షకుల కేరింతలు, ఘనమైన సంబరాల మధ్య ముగియాల్సిన ఐపీఎల్ టోర్నమెంట్​, వర్షం కారణంగా నిలిచిపోయింది. రాత్రి 11 గంటల వరకు కూడా మ్యాచ్ జరుగుతుందేమోనని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన క్రికెట్ అభిమానులకు నిరాశే ఎదురైంది. మ్యాచ్​కు రిజర్వ్ డే ఉన్నందున ఫైనల్​ సోమవారానికి వాయిదా పడింది. కానీ సోమ‌వారం కూడా మ్యాచ్​కు వర్షం ఆటంకం కలిగించ వచ్చునని వాతావరణ శాఖ తెలిపినప్పటికీ.. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మ్యాచ్​కు అనుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

Amedabad Weather Update : సోమ‌వారం మధ్యాహ్నానికి అహ్మ‌దాబాద్‌లో మబ్బులు పూర్తిగా తొలగిపోయి వాతావరణం పొడిగా మారింది. అక్కడి ప్రజలను సూర్యుడు పలకరించటంతో క్రీడాభిమానుల మొహంలో ఆనందం విరబూసింది. దీంతో మ్యాచ్​ జరగటానికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మ్యాచ్​ మధ్యలో కాస్త వర్షం కురిసినా.. ఆది అంతగా ప్రభావం చూపదని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక ఆదివారం మ్యాచ్​ రద్దు కావటంతో.. టిక్కెట్లు ఉన్న వారందనీ సోమవారం జరిగే ఫైనల్​కు అనుమతిస్తామని స్టేడియం నిర్వాహకులు తెలిపారు..

ముగింపు వేడుకలు సింపుల్​గా..

అయితే ప్రతి ఏడాదిలాగే ఈ ఐపీఎల్​ సీజన్​ కూడా ఘనంగా ముగించాలని బోర్డు భావించింది. అందుకు తగ్గ ఏర్పాట్లను భారీ ప్రణాళికతో సిద్ధం చేసింది. కానీ ఆదివారం వర్షం అంతరాయం కలిగించింది. దీంతో రిజర్వ్ డే సోమవారం అలాంటి ఘనమైన వేడుకలేవి ఉండకపోవచ్చని సమాచారం. పదహారేళ్ల ఐపీఎల్​ హిస్టరీలో వర్షం.. లీగ్​లో చాలా మ్యాచ్​లకు ఆటంకం కలిగించింది. కానీ ఫైనల్ మ్యాచ్​కు అంతరాయం ఏర్పడటం ఇదే తొలిసారి. కాగా, రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్ జరగకపోతే.. ఐపీఎల్ నిబంధనల ప్రకారం టేబుల్ టాపర్ గుజ‌రాత్ టైటాన్స్ విజేత‌గా ప్రకటిస్తారు. ఇదే గనక జరిగితే చెన్నై నష్టపోతుందనే చెప్పాలి.

గుజరాత్​కు సెంటిమెంట్​..

IPL 2023 Final Reserve Day : చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య రిజర్వ్ డే రోజు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఆదివారం నాటి తేదీతో చెన్నై టీమ్​కు సెంటిమెంట్ ఉంటే.. సోమవారం (మే 29)తో గుజరాత్​కు మంచి అనుబంధం ఉంది. అదేంటంటే.. గతేడాది ఐపీఎల్​లో అరంగేట్రం చేసిన జీటీ 2022లో సరిగ్గా ఇదే రోజున ఫైనల్​లో రాజస్థాన్​పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి టైటిల్ నెగ్గింది. దీంతో ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్​ కూడా మే 29 నాడే జరగటంతో విజయం తమదేనని గుజరాత్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ రెండు ఫైనల్ మ్యాచ్​లు కూడా అహ్మదాబాద్​లోని నరేంద్రమోదీ స్టేడియంలోనే జరగటం విశేషం.

ABOUT THE AUTHOR

...view details