IPL 2022 Successful Captains In History : ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన క్రికెట్ లీగ్. మరి అటువంటి లీగ్‌లో ఒక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం, టీమ్‌ను విజయపథంలో ముందుకు తీసుకెళ్లడం అంత ఆషామాషీ కాదు. ఎంతో ఒత్తిడి ఉంటుంది. సారథిగా వ్యవహరించిన ప్రతిఒక్కరూ విజయవంతమైన కెప్టెన్ కాలేరు. అయితే కొంతమంది మాత్రం తమ నిలకడైన ఆటతో ఈ లీగ్‌ను ఎంజాయ్ చేస్తూనే కెప్టెన్లుగానూ సక్సెస్‌ను అందుకున్నారు. జట్టును విజయపథంలో ముందుకు తీసుకెళ్లారు. కాగా,ఈ నెల 26నుంచి ఐపీఎల్-15 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో లీగ్ చరిత్రలో విజయవంతమైన టాప్-5 కెప్టెన్లు ఎవరు? వారి విజయ శాతం ఎంత ఉంది? వంటి వివరాలను ఓ సారి పరిశీలిద్దాం..
రోహిత్ శర్మ
Successful Captain Rohith Sharma: ముంబయి ఇండియన్స్ జట్టుకు 8 ఏళ్లుగా కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ.. టీమ్‌కు ఐదు సార్లు విజయాలను అందించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు 116 ఐపీఎల్ మ్యాచులకు సారథ్యం వహించిన అతడు.. అందులో 70 సార్లు విజయాన్ని అందుకున్నాడు. రోహిత్ సారథ్యంలో 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో కప్‌ను సొంతం చేసుకుంది ముంబయి ఇండియన్స్. ఇతడి విజయ శాతం 60.34గా ఉంది.
స్టీవ్ స్మిత్
Steve Smith: టీ20 లీగ్‌లతో పాటు అంతర్జాతీయ క్రికెట్లోనూ కెప్టెన్‌గా ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ తన సత్తాను నిరూపించుకున్నాడు. 2017లో పుణె వారియర్స్ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న స్టీవ్ స్మిత్.. జట్టును అద్భుతంగా ముందుకు సాగించాడు. అలాగే రాజస్థాన్ రాయల్స్‌కు కూడా కొన్ని సీజన్లకు సారథిగా వ్యవహరించాడు. మొత్తం 42 మ్యాచులకు కెప్టెన్సీ వహించిన స్మిత్ 25 విజయాల్ని అందించాడు. ఇతడి విజయ శాతం 59.52గా ఉంది.
సచిన్ తెందూల్కర్
Sachin Tendulkar: భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా పెద్దగా రాణించని సచిన్ తెందూల్కర్ ఐపీఎల్లో మాత్రం తన కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. ఇతడి సారథ్యంలో ముంబయి జట్టు 2010 సీజన్ ఫైనల్ చేరుకుంది. కానీ, తుదిపోరులో చెన్నై చేతిలో ఓడిపోయింది. మొత్తంగా ఐపీఎల్లో 51 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన సచిన్.. 30 మ్యాచ్‌ల్లో విజయవంతమయ్యాడు. ఇతడి విజయ శాతం 58.82గా ఉంది.