IPL 2022 Mega auction: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముహూర్తం దాదాపుగా ఖరారైంది! బెంగళూరు వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండు రోజుల పాటు 7, 8 తేదీల్లో నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఓ బోర్డు అధికారి తెలిపారు. కాగా, యూఏఈలో ఈ మెగా ఆక్షన్ జరుగుతుందని ప్రచారం సాగింది. అయితే కరోనా కారణంగా ఇక్కడే నిర్వహించాలని బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు.
"కొవిడ్ పరిస్థితుల వల్ల ఈ మెగా వేలం ప్రక్రియను భారత్లో నిర్వహిస్తున్నాం. రెండు రోజుల పాటు ఫిబ్రవరి 7,8 తేదీల్లో జరగుతుంది. బెంగళూరులో నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి."