తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2022: జోరుమీద లఖ్​నవూ ఫ్రాంచైజీ.. అసిస్టెంట్ కోచ్​ భర్తీ పూర్తి - విజయ్ దహియా లఖ్​నవూ ఫ్రాంచైజీ

Vijay Dahiya IPL 2022: ఐపీఎల్ 2022లో భాగంగా కొత్తగా లీగ్​లో అడుగుపెడుతున్న లఖ్​నవూ ఫ్రాంచైజీ సహాయ సిబ్బంది పదవుల భర్తీని పూర్తి చేసే పనిలో పడింది. ఇప్పటికే కోచ్​గా ఆండీ ఫ్లవర్​ను ఎంపిక చేసిన ఈ ఫ్రాంచైజీ.. తాజాగా అసిస్టెంట్ కోచ్​గా విజయ్ దహియాను నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది.ొ

Vijay Dahiya as assistant coach, Lucknow franchise appoints Vijay Dahiyam, విజయ్ దహియా లఖ్​నవూ అసిస్టెంట్ కోచ్, విజయ్ దహియా లేటెస్ట్ న్యూస్
Vijay Dahiya

By

Published : Dec 22, 2021, 1:59 PM IST

Vijay Dahiya IPL 2022: ఐపీఎల్ 2022 కోసం పక్కా వ్యూహాలు రచిస్తోంది కొత్త ఫ్రాంచైజీ లఖ్​నవూ. మెగా వేలానికి ముందు సహాయ సిబ్బందిని ఎంపిక చేసే పనిలో పడింది. ఇప్పటికే కోచ్​, మెంటార్​ను ఖరారా చేసుకున్న ఈ ఫ్రాంచైజీ.. తాజాగా అసిస్టెంట్ కోచ్ పదవినీ భర్తీ చేసింది. ప్రస్తుతం దేశవాళీ జట్టు ఉత్తరప్రదేశ్​కు కోచ్​గా ఉన్న విజయ్ దహియాను అసిస్టెంట్ కోచ్​గా నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది.

హరియాణాకు చెందిన విజయ్ దహియా (48)కు ఐపీఎల్​తో ఇప్పటికే అనుబంధం ఉంది. రెండుసార్లు లీగ్ విజేత కోల్​కతా నైట్​రైడర్స్​కు ఇతడు అసిస్టెంట్​ కోచ్​గా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే దిల్లీ క్యాపిటల్స్​కు ట్యాలెంట్​ స్కౌట్​గానూ పనిచేశాడు విజయ్.

గోయెంకా సారథ్యంలోని ఆర్‌పీ-ఎస్‌జీ గ్రూప్‌ రూ.7090 కోట్లతో లఖ్‌నవూ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసింది. ఇప్పటికే ఈ జట్టు ప్రధాన కోచ్​గా ఆండి ఫ్లవర్, మెంటార్​గా టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్​ను నియమించుకుంది.

ఇవీ చూడండి: ఆర్చర్​కు మరో సర్జరీ.. వేసవి వరకు ఆటకు దూరం

ABOUT THE AUTHOR

...view details