IPL 2022 Delhi Capitals Marsh: దిల్లీ క్యాపిటల్స్ జట్టు అభిమానులకు శుభవార్త!. గాయం కారణంగా ఈ మెగాలీగ్కు దూరమవుతాడనుకున్న ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ తిరిగి జట్టులోకి రానున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. "మార్ష్.. ఇండియా వెళ్లి అక్కడ దిల్లీ క్యాపిటల్స్ ఫిజియోథెరపిస్ట్ పాట్రిక్ ఫర్హర్ట్ ఆధ్వర్యంలో చికిత్స తీసుకుని కోలుకున్నాక జట్టులోకి చేరుతాడు" అని ప్రకటన విడుదల చేసింది. పాక్- ఆసీస్ సిరీస్ నేపథ్యంలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడిన మిచెల్ మార్ష్ ఆ సిరీస్ నుంచి పూర్తిగా వైదొలిగాడు. ఇక, ఐపీఎల్ లీగ్ మొత్తానికి దూరమవుతాడని వార్తలు వచ్చాయి.
దిల్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు! - mitchel marsh
IPL 2022 Delhi Capitals Marsh: దిల్లీ క్యాపిటల్స్ జట్టు అభిమానులకు గుడ్‌న్యూస్. గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్.. మరికొద్ది రోజుల్లో జట్టులోకి చేరనున్నాడు.
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ మెగావేలంలో మార్ష్‌ను దిల్లీ క్యాపిటల్స్ రూ.6.5 కోట్లకు సొంతం చేసుకుంది. కాగా, 2010లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన మిచెల్ మార్ష్ 21 మ్యాచులు ఆడి 225 పరుగులు సాధించాడు. మార్ష్.. ఆస్ట్రేలియా తొలి టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఆ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. గతేడాది ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఆస్ట్రేలియా తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 36.88 సగటుతో 627 పరుగులు చేశాడు.
ఇదీ చదవండి: IPL 2022: ధోనీ సహా సీనియర్ల విశ్వరూపం.. కుర్రాళ్లు కేక.. కానీ..