తెలంగాణ

telangana

ETV Bharat / sports

దుమ్ముదులిపిన చెన్నై ఓపెనర్లు.. హైదరాబాద్​ ముందు భారీ లక్ష్యం - సీఎస్​కే ఎస్​ఆర్​హెచ్​

IPL 2022 CSK vs SRH: సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరుగుతున్న మ్యాచ్​లో చెన్నై​ ఓపెనర్లు రుతురాజ్​ గైక్వాడ్​, డేవన్​ కాన్వే రెచ్చిపోయారు .​ దీంతో సన్​రైజర్స్​ ముందు 203 పరుగులు భారీ లక్ష్యాన్ని ఉంచింది సీఎస్​కే.

match story
match story

By

Published : May 1, 2022, 9:22 PM IST

IPL 2022 DC vs RR: ఐపీఎల్​ టీ20 మెగా లీగ్​ 15వ సీజన్​ రసవత్తరంగా సాగుతోంది. సన్​రైజర్స్​ హైదరాబాద్​తో పుణెలో మహారాష్ట్ర క్రికెట్​ అసోసియేషన్ మైదానంలో ఆదివారం సాయంత్రం జరుగుతున్న మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్​​ ఓపెనర్లు విధ్వంసం సృష్టించారు. తొలి వికెట్​కు 182 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు భారీ స్కోర్​ సాధించేందుకు బాటలు వేశారు. ఈ క్రమంలో రుతురాజ్‌ కాస్తలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఈ సీజన్​లో ఓపెనర్లు సాధించిన అత్యధిక భాగస్వామ్యం ఇదే కావడం విశేషం.

నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది చెన్నై​. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్ (99), డేవన్‌ కాన్వే (85*) అదరగొట్టారు. ఎంఎస్ ధోనీ 8, జడేజా ఒక పరుగు చేశాడు. దీంతో సన్​రైజర్స్​ ముందు 203 పరుగులు భారీ లక్ష్యాన్ని ఉంచింది సీఎస్​కే హైదరాబాద్‌ బౌలర్‌ నటరాజన్‌కే రెండు వికెట్లు పడ్డాయి.

ఇదీ చదవండి:చెలరేగిన బౌలర్లు​.. లఖ్​నవూ హ్యాట్రిక్​ విజయం

ABOUT THE AUTHOR

...view details