Dewald Brevis: ఐపీఎల్ 2022 మెగా వేలంలో శనివారం పలువురు భారత కుర్రాళ్లు రికార్డు ధరలకు అమ్ముడుపోయారు. మొత్తం పది ఫ్రాంఛైజీలు నాణ్యమైన ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. ఈ క్రమంలోనే ఎప్పుడూ యువ టాలెంట్‌ను వెలికితీసే ముంబయి ఇండియన్స్ ఈసారి కూడా అదే పంథాను అనుసరించింది. బేబీ ఏబీ డివిలియర్స్‌గా పేరుగాంచిన దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్‌ను రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. అతడీ వేలంలో కనీస ధర రూ.20లక్షలతో అడుగుపెట్టగా ముంబయి భారీ మొత్తం చెల్లించేందుకు సిద్ధమైంది.
వరల్డ్‌కప్‌లో సంచలనం..
అందుకు కారణం ఇటీవల జరిగిన అండర్-19 ప్రపంచకప్పే. అక్కడ ఈ యువ బ్యాట్స్‌మన్ 506 పరుగులు చేశాడు. దీంతో టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో 18 ఏళ్ల నాటి శిఖర్ ధావన్ రికార్డును బద్దలుకొట్టాడు. 2004లో అంబటి రాయుడు కెప్టెన్సీలో ధావన్ 505 పరుగులు చేసి అప్పట్లో సంచలనం సృష్టించాడు. ఇప్పుడు దాన్నే బేబీ డివిలియర్స్ అధిగమించాడు. మరోవైపు మెగా వేలంలో ఈ యువ ప్రతిభావంతుడిని తీసుకొనేందుకు తొలుత చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ ఆసక్తి చూపించాయి. అయితే, చివరికి ముంబయి సొంతం చేసుకుంది.
బేబీ ఏబీ.. ఒకే స్కూల్.. ఒకే జెర్సీ నెం..