పంజాబ్ జట్లును ఓడించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించామని ముంబయి ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ చెప్పాడు. ముఖ్యంగా కెప్టెన్, ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపాడు. అబుదాబి వేదికగా పంజాబ్‌తో గురువారం తలపడనుంది ముంబయి జట్టు. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో 222 పరుగులు చేసిన రాహుల్ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.
"రాహుల్ గత కొన్ని మ్యాచ్‌ల్లో మాకు పోటీగా పరుగులు సాధించాడు. ఎంతో అద్భుతమైన ఆటగాడు అతడు. ఈ రోజు మధ్యాహ్నం బౌలర్లందరితో సమావేశం ఏర్పాటు చేయనున్నాం. కచ్చితంగా ప్రత్యర్థి జట్టును మట్టికరిపించేందుకు తగ్గట్లు ప్రణాళికలు సిద్ధం చేస్తాం. రాహుల్ మిడిల్ ఓవర్లలో దూకుడుగా ఆడతాడని తెలుసు. తన తోటి బ్యాట్స్‌మన్‌పై మా బౌలర్లు ఒత్తిడి పెంచొచ్చు"