షార్జా వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది బెంగళూరు జట్టు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. నిర్ణీత ఓవర్లలో 120 పరుగులకు పరిమితమైంది.
ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐదు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. అయితే.. పిచ్‌ను హైదరాబాద్ జట్టు సక్రమంగా వినియోగించుకందని అభిప్రాయపడ్డాడు బెంగళూరు జట్టు సారథి విరాట్ కోహ్లి. మంచు వల్ల బౌలింగ్‌లో తాము ఇబ్బంది పడ్డామని చెప్పాడు.
"ఇన్నింగ్స్ ఆసాంతం మేము బ్యాటింగ్‌లో తడబడ్డాం. ఇదంతా ప్రత్యర్థి జట్టుకే దక్కుతుంది. పిచ్‌ను హైదరాబాద్ జట్టు సక్రమంగా వినియోగించుకుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో పరిస్థితులు చాలా మారిపోయాయి. ఊహించనంత మంచు ఏర్పడింది. టాస్ గెలిచి హైదరాబాద్ జట్టు సరైన నిర్ణయం తీసుకుంది. చివరలో బంతిపై పట్టు సాధించడం చాలా క్లిష్టంగా మారింది."
--విరాట్ కోహ్లీ, బెంగళూరు జట్టు కెప్టెన్.
బెంగళూరు కుర్రాడినే..
లీగ్‌లో తాము తలపడే చివరి మ్యాచ్‌లో, దిల్లీ క్యాపిటల్స్‌పై గెలచి ప్లే ఆఫ్‌లో నిలుస్తామని చెప్పాడు విరాట్. ఐపీఎల్లో తాను ఎప్పడూ బెంగళూరు వాడినేనని అన్నాడు.