తెలంగాణ

telangana

ETV Bharat / sports

మెరుపు క్యాచ్​తో డుప్లెసిస్​ అదుర్స్​! - csk news updates

సీఎస్కే ఆటగాడు డుప్లెసిస్​ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో ఓ క్యాచ్​తో అందరి దృష్టినీ ఆకర్షించాడు. బౌండరీ లైన్​ వద్ద బంతిని అద్భుతంగా ఒడిసి పట్టాడు.

du plessis
డుప్లెసిస్​

By

Published : Oct 3, 2020, 10:39 AM IST

హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్​కింగ్స్​ ఆటగాడు డుప్లెసిస్​ బౌండరీ వద్ద ఓ మెరుపు క్యాచ్​ అందుకున్నాడు. చావ్లా బౌలింగ్​లో వార్నర్​ క్రీజు వదిలి భారీ షాట్​కు ప్రయత్నించగా.. లాగ్​ఆన్​లో ఉన్న డుప్లెసిస్​ గాల్లోకి ఎగిరి క్యాచ్​ పట్టేశాడు. కానీ, బౌండరీ లైన్​ దాటకుండా నియంత్రించుకోలేకపోయాడు. అయితే, అలా లైన్​ దాటే మందే బంతిని గాల్లోకి ఎగరేసి.. మళ్లీ మైదానంలోకి వచ్చి క్యాచ్​ అందుకున్నాడు.

గతంలోనూ ఇలాంటి విన్యాసాలు చేసిన అనుభవం ఉన్న డుప్లెసిస్​.. ఈ సారి చాలా కూల్​గా బంతిని ఒడిసి పట్టేశారు. ఈ మ్యాచ్​లో సీఎస్కేపై ఏడు పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది.

ABOUT THE AUTHOR

...view details