ఇటీవలే టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. కాగా ఇతడి స్థానంలో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కు స్థానం కల్పించారు సెలక్టర్లు. కానీ వారి నమ్మకాన్ని అతడు నిలబెట్టుకోలేక పోయాడు. దీంతో కేఎల్ రాహుల్‌ను కీపర్‌గా ప్రయత్నించింది యాజమాన్యం. అతడు సక్సెస్ కావడం వల్ల పంత్ స్థానం కష్టాల్లో పడిందని అంతా భావించారు.
అయితే పంత్ ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతోన్న ఐపీఎల్‌లో రాణిస్తున్నాడు. దీంతో మరోసారి భారత జట్టుకు వికెట్ కీపర్‌గా ఇతడే సరైన వాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. టీమ్ఇండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.