ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌పై ముంబయి ఇండియన్స్ పరాజయం చెందింది. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు మంచి ఆరంభం లభించింది. కానీ ఆ తర్వాత వెంటవెంటనే ఐదు వికెట్లు కోల్పోవడం వల్ల అదే ఊపును చివరి వరకు కొనసాగించలేక పోయింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులతో మంచి రన్రేట్సాధించింది. 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఛేదనలో చెన్నై సూపర్‌కింగ్స్ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అంబటి రాయుడు (71), డుప్లెసిస్ (58) మంచి భాగస్వామ్యం చేసి జట్టుకు విజయాన్ని అందించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తర్వాతి మ్యాచ్‌లో తెలివిగా రాణిస్తామని తెలిపాడు.