తెలంగాణ

telangana

ETV Bharat / sports

తడబడిన దిల్లీ.. ఫైనల్​కు చేరిన ముంబయి

ముంబయి ఇండియన్స్​ జట్టు ఐపీఎల్​లో మరోసారి ఫైనల్​ చేరింది. దుబాయ్​ వేదికగా జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​పై 57 పరుగుల తేడాతో రోహిత్​ సేన భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

MI vs DC: Mumbai Indians crush Delhi Capitals by 57 runs to enter final
తడబడిన దిల్లీ.. ఫైనల్​లో తొలి బెర్తు ముంబయిదే

By

Published : Nov 5, 2020, 11:33 PM IST

ఐపీఎల్​లోని కీలక మ్యాచ్‌లో అదరగొట్టిన ముంబయి మరోసారి ఫైనల్‌ చేరింది. ఒత్తిడికి తలొగ్గిన దిల్లీ ఓడిపోయింది. ముంబయి బ్యాట్స్‌మెన్‌ బౌండరీలతో చెలరేగిన పిచ్‌పై దిల్లీ బ్యాట్స్‌మెన్‌ తేలిపోయారు. దిల్లీ బౌలర్లు విఫలమైన చోటే ముంబయి బౌలర్లు రెచ్చిపోయారు. బ్యాటింగ్‌ బౌలింగ్‌ అన్ని విభాగాల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన ముంబయి దిల్లీని 57 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. టీ20 లీగ్‌ 13వ సీజన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన తొలి జట్టుగా నిలిచింది.

201 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన దిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పరుగుల ఖాతా తెరవకుండానే ఆ జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పృథ్వీషా, అజింక్య రహానె, శిఖర్‌ ధావన్‌ ముగ్గరు పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు క్యూ కట్టారు. మూడు ఫోర్లు కొట్టిన కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (12) సైతం ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. పంత్‌ (3) మరోసారి విఫలమయ్యాడు. స్టాయినీస్‌ (65), అక్షర్‌ పటేల్‌ (42) రాణించారు. అయినా.. దిల్లీ పరాజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు. ముంబయి బౌలర్లలో బుమ్రా 4, బౌల్ట్‌ 2 వికెట్లు తీసి దిల్లీని దెబ్బ కొట్టారు.

ఈ మ్యాచ్‌లో రికార్డులు..

  • లీగ్‌ చరిత్రలోనే పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ముంబయి పేస్‌ బౌలర్ బౌల్ట్(14 వికెట్లు) నిలిచాడు
  • ముంబయి మొదట బ్యాటింగ్ చేసి 200 పరుగులు చేసిన ప్రతి సారి గెలిచింది. ఇప్పటి వరకూ 11 మ్యాచుల్లో ఇదే జరిగింది.

ABOUT THE AUTHOR

...view details