తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీసేనపై 10 రన్స్​ తేడాతో కేకేఆర్​ విజయం - కోల్‌కత స్క్వాడ్ టుడే

KKR vs CSK Live Score, IPL 2020 Match Today
చెన్నై vs కోల్​కతా: మూడో విజయం కోసం పోరాటం

By

Published : Oct 7, 2020, 6:40 PM IST

Updated : Oct 7, 2020, 11:42 PM IST

23:31 October 07

టోర్నీ కోల్​కతా మూడో విజయం

చెన్నై సూపర్​కింగ్స్​పై 10 పరుగుల తేడాతో కోల్​కతా విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయిన చెన్నై 157 పరుగులు చేసింది. ప్రస్తుత ఐపీఎల్​లో 5 మ్యాచ్​లు ఆడిన కేకేఆర్​ మూడు మ్యాచ్​ల్లో నెగ్గి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. గతమ్యాచ్​లో తిరిగి పుంజుకున్న సీఎస్కే అదే ప్రభావాన్ని కోల్​కతాపై చూపలేకపోయింది. 

23:23 October 07

ఉత్కంఠగా సాగుతున్న మ్యాచ్​

19 ఓవర్ల పూర్తయ్యే సమయానికి చెన్నై ఐదు​ వికెట్లు​ కోల్పోయి 142 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో కేదార్​ జాదవ్​(6), జడేజా​(7) ఉన్నారు. గెలుపు కోసం ధోనీసేన 6 బంతుల్లో 26 రన్స్​ చేయాల్సిఉంది.

23:19 October 07

18 ఓవర్లకు చెన్నై 132/5

18 ఓవర్లకు చెన్నై సూపర్​కింగ్స్ ఐదు​ వికెట్లు​ నష్టపోయి 132 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో జాదవ్​(1), జడేజా​(2) ఉన్నారు. గెలుపు కోసం సీఎస్కే 12 బంతుల్లో 36 రన్స్​ చేయాల్సిఉంది.

23:16 October 07

సామ్​ కరన్​ ఔట్​

కోల్​కతా బౌలర్​ ఆండ్రూ రస్సెల్​ బౌలింగ్​లో సీఎస్కే బ్యాట్స్​మన్​ సామ్​ కరన్​(17) షాట్​కు ప్రయత్నించబోయి ఇయాన్​ మోర్గాన్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 

23:12 October 07

ధోనీ ఔట్​

కోల్​కతా బౌలర్​ వరుణ్​ చక్రవర్తి బౌలింగ్​లో సీఎస్కే కెప్టెన్​ యంఎస్​ ధోనీ(11) బౌల్డ్​గా వెనుదిరిగాడు. గెలుపు కోసం 21 బంతుల్లో 39 పరుగులు చేయాల్సిఉంది.

23:06 October 07

16 ఓవర్లకు చెన్నై 124/3

16 ఓవర్లకు చెన్నై సూపర్​కింగ్స్​ మూడు వికెట్లు​ నష్టపోయి 124 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో యంఎస్ ధోనీ(7), సామ్​ కరన్​(16) ఉన్నారు. గెలుపు కోసం సీఎస్కే 24 బంతుల్లో 44 రన్స్​ చేయాల్సిఉంది.

22:50 October 07

వాట్సన్​ ఔట్​

చెన్నై బ్యాట్స్​మన్​ షేన్​ వాట్సన్​ తన అధ్బుతమైన ప్రదర్శనతో హాఫ్​సెంచరీ చేసి అలరించి.. కోల్​కతా బౌలర్​ సునీల్​ నరైన్​ వేసిన బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 14 ఓవర్లకు చెన్నై సూపర్​కింగ్స్​ మూడు వికెట్లు​ నష్టపోయి 104 పరుగులు చేసింది. యంఎస్​ ధోనీ(1), సామ్​ కరన్​(3) క్రీజ్​లో ఉన్నారు.  

22:46 October 07

రాయుడు ఔట్​

కోల్​కతా బౌలర్​ నాగర్​కోటి వేసిన బంతికి సీఎస్కే బ్యాట్స్​మన్ అంబటి రాయుడు(30).. శుభ్​మన్​ గిల్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. ​ 

22:42 October 07

12 ఓవర్లకు చెన్నై 99/1

12 ఓవర్లకు చెన్నై సూపర్​కింగ్స్​ వికెట్​ నష్టపోయి 99 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో షేన్​ వాట్స్​న్​(49), అంబటి రాయుడు(30) ఉన్నారు. 

22:30 October 07

దూకుడు పెంచిన సీఎస్కే

చెన్నై సూపర్​కింగ్స్​ బ్యాట్స్​మెన్​ క్రమంగా బ్యాటింగ్​లో స్పీడ్​ పెంచారు. పది ఓవర్లు పూర్తయ్యే సమయానికి ఒక వికెట్​ కోల్పోయిన సీఎస్కే 90 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో షేన్​ వాట్సన్​(47), అంబటి రాయుడు(24) ఉన్నారు. ధోనీసేన గెలుపు కోసం 60 బంతుల్లో 78 పరుగులు చేయాల్సిఉంది.

22:24 October 07

8 ఓవర్లకు చెన్నై 69/1

8 ఓవర్లకు చెన్నై సూపర్​కింగ్స్​ వికెట్​ నష్టపోయి 69 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో షేన్​ వాట్స్​న్​(30), అంబటి రాయుడు(20) ఉన్నారు. 

22:11 October 07

6 ఓవర్లకు చెన్నై 54/1

డుప్లెసిస్​ రూపంలో చెన్నై సూపర్​కింగ్స్​ వికెట్​ కోల్పోయినా.. ఆ జట్టు బ్యాట్స్​మెన్​ షేన్​ వాట్సన్​(26), అంబటి రాయుడు(9) నిలకడగా రాణిస్తున్నారు. 6 ఓవర్లకు చెన్నై ఒక వికెట్​ నష్టానికి 54 పరుగులు చేసింది. 

22:00 October 07

డుప్లెసిస్​ ఔట్​

కోల్​కతా బౌలర్​ శివమ్​ మావి వేసిన బంతికి చెన్నై బ్యాట్స్​మన్​ ఫాఫ్​ డు ప్లెసిస్​(17) కీపర్​ దినేశ్​ కార్తిక్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. నాలుగు ఓవర్లకు చెన్నై వికెట్​ నష్టపోయి 32 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో షేన్​ వాట్సన్​(13), అంబటి రాయుడు(1) ఉన్నారు. 

21:49 October 07

2 ఓవర్లకు చెన్నై 18/0

2 ఓవర్లకు చెన్నై సూపర్​కింగ్స్​ వికెట్​ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో ఫాఫ్​ డు ప్లెసిస్​(11), షేన్​ వాట్స్​న్​(7) ఉన్నారు. 

21:29 October 07

చెన్నై లక్ష్యం 168

ఆరంభంలో నిలకడగా రాణించిన కోల్​కతా బ్యాట్స్​మెన్​ ఓపెనర్లు కొంతమేర ప్రదర్శన చేసినా.. మిడిల్​ ఆర్డర్​ పూర్తిగా విఫలమైంది. జట్టులో ఒకరిద్దరూ బ్యాట్స్​మెన్​ తప్ప, మిగిలిన వారంతా పేలవ ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో కోల్​కతా 167 పరుగులు చేసి ఆలౌటైంది. రాహుల్​ త్రిపాఠి(81) చేసిన అర్ధశతకంతో జట్టుకు స్కోరును పరుగులు పెట్టించడంలో సహకరించాడు. చివరి ఓవర్లలో బౌలింగ్​ చేసిన బ్రావో.. మూడు వికెట్లు సాధించాడు.

21:21 October 07

నాగర్​కోటి ఔట్​

బ్రావో బౌలింగ్​లో డుప్లెసిస్​కు క్యాచ్​ ఇచ్చిన కోల్​కతా బ్యాట్స్​మన్​ కమ్​లేశ్​ నాగర్​కోటి డకౌట్​గా వెనుదిరిగాడు.

21:17 October 07

దినేశ్​ కార్తిక్​ ఔట్​

సామ్​ కరన్​ బౌలింగ్​లో కోల్​కతా కెప్టెన్​ దినేశ్​ కార్తిక్(12).. శార్దూల్​ ఠాకూర్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు.

21:12 October 07

18 ఓవర్లకు కోల్​కతా 154/6

18 ఓవర్లకు కోల్​కతా ఆరు వికెట్లు​ నష్టపోయి 154 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో దినేశ్​ కార్తిక్​​(7), పాట్​ కమ్మిన్స్​(11)లు ఉన్నారు. 

21:05 October 07

త్రిపాఠి ఔట్​

తన అర్ధశతకంతో కోల్​కతా స్కోరుబోర్డును పరుగులు పెట్టించిన బ్యాట్స్​మన్​ రాహుల్​ త్రిపాఠి(81) ఔటయ్యాడు. చెన్నై బౌలర్​ బ్రావో వేసిన బంతికి షేన్​ వాట్సన్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 

20:57 October 07

రస్సెల్​ ఔట్​

శార్దూల్​ ఠాకూర్​ బౌలింగ్​లో కోల్​కతా బ్యాట్స్​మన్​ ఆండ్రూ రస్సెల్​(2) కీపర్​ ధోనీకి క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 16 ఓవర్లు పూర్తయ్యే సమయానికి కోల్​కతా ఐదు వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో రాహుల్​ త్రిపాఠి(75), దినేశ్​ కార్తిక్​(4) ఉన్నారు. 

20:45 October 07

మోర్గాన్​ ఔట్​ 

చెన్నై బౌలర్​ సామ్​ కరన్​ వేసిన బంతికి కోల్​కతా బ్యాట్స్​మన్​ ఇయాన్​ మోర్గాన్​(7).. కీపర్​ ధోనీకి క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 14 ఓవర్లు పూర్తయ్యే సమయానికి నాలుగు వికెట్లు నష్టపోయిన కోల్​కతా 114 పరుగులు చేసింది. రాహుల్​ త్రిపాఠి(62) క్రీజ్​లో ఉన్నాడు.

20:36 October 07

12 ఓవర్లకు కోల్​కతా 105/3

మూడో వికెట్​ కోల్పోయిన క్రీజ్​లో ఉన్న అర్ధశతక  వీరుడు నితీశ్​ రాణా నిలకడగా రాణిస్తున్నాడు. 12 ఓవర్లు పూర్తయ్యే సమయానికి మూడు వికెట్లు నష్టపోయిన కోల్​కతా 105 పరుగులు చేసింది. రాహుల్​ త్రిపాఠి(56), ఇయాన్​ మోర్గాన్​(5) క్రీజ్​లో ఉన్నారు.

20:29 October 07

సునీల్​ నరైన్​ ఔట్​

చెన్నై స్పిన్నర్ కర్ణ్​ శర్మ వేసిన బంతికి సిక్సర్​ బాదడానికి ప్రయత్నించిన కోల్​కతా బ్యాట్స్​మన్​ సునీల్​ నరైన్​(17).. డుప్లెసిస్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు.

20:25 October 07

10 ఓవర్లకు కోల్​కతా 93/2

కోల్​కతా బ్యాట్స్​మన్​ రాహుల్​ త్రిపాఠి అర్ధశతకాన్ని నమోదు చేశాడు. పది ఓవర్లకు కోల్​కతా రెండు వికెట్లు​ నష్టపోయి 93 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో రాహుల్​ త్రిపాఠి​(53), నితీశ్​ రానా(15)లు ఉన్నారు.  

20:21 October 07

నితీశ్​ రానా ఔట్​

చెన్నై బౌలర్​ కర్ణ్​​ శర్మ వేసిన బంతిని కోల్​కతా బ్యాట్స్​మన్​ నితీశ్​ రానా(9) భారీ షాట్​​కు ప్రయత్నించి జడేజాకు క్యాచ్​ ఇచ్చి పెవీలియన్​ చేరాడు

20:15 October 07

8 ఓవర్లకు కోల్​కతా 70/1

8 ఓవర్లకు కోల్​కతా వికెట్​ నష్టపోయి 70 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో రాహుల్​ త్రిపాఠి​(46), నితీశ్​ రానా(9)లు ఉన్నారు.  

20:02 October 07

6 ఓవర్లకు కోల్​కతా 52/1

ఆరు ఓవర్లకు కోల్​కతా వికెట్​ నష్టపోయి 52 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో రాహుల్​ త్రిపాఠి​(31), నితీశ్​ రానా(6)లు ఉన్నారు.  

19:56 October 07

శుభ్​మన్​ ఔట్​

చెన్నై బౌలర్​ శార్దూల్​ ఠాకూర్​ వేసిన బంతికి కోల్​కతా బ్యాట్స్​మన్​ శుభ్​మన్​ గిల్​(11) కీపర్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 

19:51 October 07

4 ఓవర్లకు కోల్​కతా 36/0

4 ఓవర్లకు కోల్​కతా వికెట్​ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో శుభ్​మన్​ గిల్​(11), రాహుల్​ త్రిపాఠి(23)లు ఉన్నారు.  

19:31 October 07

2 ఓవర్లకు కోల్​కతా 10/0

చెన్నై పేసర్​ దీపక్​ చాహర్​ వేసిన బౌలింగ్​లో వేసిన తొలి బంతిని కోల్​కతా ఓపెనింగ్​ బ్యాట్స్​మన్​ రాహుల్​ త్రిపాఠి ఫోర్​గా మలిచి శుభారంభాన్ని ఇచ్చాడు. రెండు ఓవర్లు పూర్తయ్యే సమయానికి కోల్​కతా వికెట్​ కోల్పోకుండా 10 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో శుభ్​మన్​ గిల్​(3), రాహుల్​ త్రిపాఠి(5)లు ఉన్నారు.  

19:02 October 07

టాస్​ గెలిచి బ్యాటింగ్​​ ఎంచుకున్న కోల్​కతా

టాస్​ గెలిచిన కోల్​కతా కెప్టెన్​ దినేష్​ కార్తిక్​ బ్యాటింగ్​​ ఎంచుకున్నాడు.

జట్లు

చెన్నై సూపర్ కింగ్స్:షేన్ వాట్సన్, ఫాఫ్ డు ప్లెసిస్, అంబటి రాయుడు, యంఎస్ ధోని (కెప్టెన్​, వికెట్​ కీపర్​), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, సామ్ కరన్​, కర్న్ శర్మ, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్.

కోల్‌కతా నైట్ రైడర్స్: శుభ్​మన్​ గిల్, సునీల్ నరైన్, నితీశ్​ రానా, ఆండ్రూ రస్సెల్, దినేశ్​ కార్తీక్ (కెప్టెన్​, వికెట్​ కీపర్​), ఇయాన్ మోర్గాన్, పాట్ కమ్మిన్స్, రాహుల్ త్రిపాఠి, కమలేశ్​ నాగర్‌కోటి, శివం మావి, వరుణ్ చక్రవర్తి.

18:01 October 07

చెన్నై అదే జోరు కొనసాగిస్తుందా?

ఐపీఎల్​లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా చెన్నై సూపర్​కింగ్స్​ - కోల్​కతా నైట్​రైడర్స్​ మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. టోర్నీలో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్​లు ఆడి రెండు నెగ్గిన కోల్​కతా.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​పై అద్భుత విజయంతో ధోనీసేన జోరుమీదుంది. ప్రస్తుత ఐపీఎల్​లో ఐదు మ్యాచ్​లు ఆడిన సీఎస్కే.. రెండింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో ఐదోస్థానంలో ఉంది. ముచ్చటగా మూడో విజయం కోసం ఇరుజట్లు పకడ్బంధీగా ప్రణాళికలను రచిస్తున్నారు. 

Last Updated : Oct 7, 2020, 11:42 PM IST

ABOUT THE AUTHOR

...view details