తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆర్సీబీ x ముంబయి : ఆధిపత్యం చెలాయించేది ఎవరు?

దుబాయ్​ వేదికగా రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు​, ముంబయి ఇండియన్స్​​​.. సోమవారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

IPL MATCH
ఆర్సీబీ x ముంబయి

By

Published : Sep 28, 2020, 5:32 AM IST

Updated : Sep 28, 2020, 9:20 AM IST

తొలి మ్యాచ్​తో బోణీ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. తర్వాతి పోరులో పంజాబ్​ చేతిలో ఘోరంగా ఓడింది. ముంబయి ఇండియన్స్​.. చెన్నైపై ఓడినా, పుంజుకుని.. కోల్​కతా​పై అద్భుత విజయం సాధించింది. ఇప్పుడీ రెండు జట్లు సోమవారం మ్యాచ్​లో హోరాహోరీగా తలపడనున్నాయి. తమపై వస్తున్న విమర్శలకు చెక్​పెట్టాలని కోహ్లీ సేన, విజయాన్ని కొనసాగించాలని రోహిత్ సేన పట్టుదలతో ఉన్నాయి. కచ్చితమైన వ్యూహాలు అమలు చేసి, పాయింట్లు పెంచుకోవాలని చూస్తున్నాయి. ఈ సందర్భంగా ఇరుజట్ల బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం.

బెంగళూరు జట్టు

తొలిమ్యాచ్​లో సన్​రైజర్స్ ​హైదరాబాద్​పై గెలిచి మారినట్టే కనిపించింది. ఆ తర్వాత మ్యాచ్​లో పంజాబ్​పై ఊహించలేనంత ఘోరంగా విఫలమైంది. కనీసం పంజాబ్​ కెప్టెన్ కేఎల్​ రాహుల్​(132) చేసిన వ్యక్తిగత స్కోరు కూడా దాటలేకపోయింది. జట్టులో స్టార్​ ఆటగాళ్లు ఫించ్​, డివిలియర్స్, కోహ్లీతో పాటు అందరూ విఫలమయ్యారు. ఈ మ్యాచ్​లోనైనా తమ ప్రదర్శన మార్చుకుని, గెలుపు రుచిచూడాలని భావిస్తున్నారు.

ముంబయి ఇండియన్స్​

తొలి మ్యాచ్​లో చెన్నై జట్టుపై ఓడి, అనంతరం కోల్​కతా నైట్​రైడర్స్​పై కసిగా ఆడి అద్భుత విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్​ శర్మ(80) అద్భుతమైన బ్యాటింగ్​తో దంచికొట్టాడు. సౌరభ్​ తివారి, సూర్య కుమార్​ యాదవ్​ బాగానే ఆడారు. బుమ్రా, బౌల్ట్​, రాహుల్​ చాహర్ చెరో రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును ఓడించడంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పుడిదే జోష్​ను ఈ మ్యాచ్​లోనూ కొనసాగిస్తే ముంబయి గెలవడం కష్టమేమి కాదు.

జట్టు అంచనాలు

బెంగళూరు:

దేవ్​దత్ పడిక్కల్, ఫించ్, కోహ్లీ(కెప్టెన్), డివిలియర్స్, శివమ్ దూబే, జోష్ ఫిలిప్పి, వాషింగ్టన్ సుందర్, నవ్​దీప్ సైనీ, ఉమేశ్ యాదవ్, స్టెయిన్, చాహల్

ముంబయి:

రోహిత్ శర్మ(కెప్టెన్​), క్వింటన్​ డికాక్​, సూర్యకుమార్​ యాదవ్​, సౌరభ్​ తివారి, హార్దిక్​ పాండ్య, పొలార్డ్​, కృనాల్​ పాండ్య, జేమ్స్​ పాటిన్సన్​, రాహుల్​ చాహర్​, బౌల్ట్​, బుమ్రా

ఇదీ చూడండి చెన్నై ట్విట్టర్​ను రైనా అన్​ఫాలో చేశాడా?

Last Updated : Sep 28, 2020, 9:20 AM IST

ABOUT THE AUTHOR

...view details