తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అందుకే మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నాం'

కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్​లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న సన్​రైజర్స్ సారథి వార్నర్ నిర్ణయాన్ని అందరూ తప్పుబట్టారు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన వార్నర్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.

Warner defends his decision of batting first despite loss vs KKR
వార్నర్

By

Published : Sep 27, 2020, 10:56 AM IST

Updated : Sep 27, 2020, 2:10 PM IST

కోల్​కతా నైట్​రైడర్స్​​తో శనివారం జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన సన్​రైజర్స్ సారథి డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీనిపై విమర్శలు వచ్చాయి. అయితే తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు వార్నర్. తమ బౌలింగ్ విభాగం బలంగా ఉందని.. కోల్​కతాను తక్కువ పరుగులకు కట్టిడి చేయాలనుకున్నట్లు వెల్లడించాడు.

సన్​రైజర్స్-నైట్​రైడర్స్

"నేను ఆ నిర్ణయం సరైందే అనుకుంటున్నా. మా బలం బౌలింగ్. ఈ పిచ్​పై బ్యాటింగ్​ చేయడం కష్టం అనుకున్నాం. నేను నా నిర్ణయానికి కట్టుబడి ఉంటా. ప్యాట్ కమిన్స్ టెస్టు మ్యాచ్​ మాదిరి లైన్ అండ్ లెన్త్​తో బౌలింగ్ చేశాడు. మిడిలార్డర్​ ఇంకా మెరుగవ్వాలి. ప్రారంభంలో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. నాలుగు, ఐదు ఓవర్ల వరకు 20 పరుగులే ఇచ్చాం. కానీ కేవలం మూడు వికెట్లే తీయడం కొంచెం బాధగా ఉంది. మరో 30,40 పరుగులు చేస్తే బాగుండేది."

- వార్నర్, సన్​రైజర్స్ సారథి

ఈ మ్యాచ్​లో కోల్​కతా సన్​రైజర్స్ మొదట బ్యాటింగ్ చేసి 142 పరుగులు చేసింది. వార్నర్ 36 పరుగులతో మంచి ప్రారంభం ఇవ్వగా.. మనీశ్ పాండే (51) అర్ధసెంచరీతో రాణించాడు. తర్వాత 143 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది కోల్​కతా. శుభమన్​ గిల్​(70 ) అర్థశతకంతో అదరగొట్టి కోల్​కతా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడికే మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు దక్కింది.

పాయింట్ల పట్టిక
Last Updated : Sep 27, 2020, 2:10 PM IST

ABOUT THE AUTHOR

...view details