తెలంగాణ

telangana

ETV Bharat / sports

బౌలర్ల తప్పేంలేదు.. ఓడింది వారి వల్లే: ధోనీ - ధోనీ ఐపీఎల్

కోల్​కతాపై తమ బ్యాట్స్​మెన్ సరిగా ఆడకపోవడం వల్లే ఓడిపోయామని ధోనీ అభిప్రాయపడ్డాడు. వారు రాణించి ఉంటే ఫలితం వేరుగా ఉండేదని తెలిపాడు.

IPL 2020: MS Dhoni reacts to CSK's fourth defeat of this season
బౌలర్ల తప్పేంలేదు.. అంతా బ్యాట్స్​మెన్ వల్లే: ధోనీ

By

Published : Oct 8, 2020, 8:14 AM IST

తమ బ్యాట్స్​మెన్ వైఫల్యమే, కోల్​కతా నైట్​రైడర్స్ చేతిలో ఓటమికి ప్రధాన కారణమని చెన్నై సూపర్​కింగ్స్ కెప్టెన్ ధోనీ అన్నాడు. బౌలర్లు మాత్రం బాగా ఆడారని ప్రశంసించాడు.

అబుదాబి వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్​లో కోల్​కతా నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి(51 బంతుల్లో 81) అదరగొట్టాడు. ఛేదనలో చెన్నైకి మంచి ఆరంభమే దక్కింది కానీ.. మిడిలార్డర్ బ్యాట్స్​మెన్ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. దీంతో 10 పరుగుల తేడాతో ఓడింది.

చెన్నై సూపర్​కింగ్స్ కెప్టెన్ ధోనీ

"మధ్య ఓవర్లలో కోల్​కతా బౌలర్లకు మా బ్యాట్స్​మెన్ వికెట్లు సమర్పించుకున్నారు. అప్పుడు మేం బాగా ఆడుంటే ఫలితం వేరేలా ఉండేది. మా(చెన్నై) బౌలర్లు ప్రత్యర్థి జట్టును 160 పరుగుల లోపే కట్టడి చేశారు. కానీ మా బ్యాట్స్​మెన్ సరిగా ఆడలేదు. చివర్లో బౌండరీలు కొట్టలేకపోయారు" -ధోనీ, సీఎస్కే కెప్టెన్

చెన్నై జట్టులో వాట్సన్(50), రాయుడు(30), జడేజా(21) మినహా మిగిలిన వారందరూ త్వరత్వరగా ఔటయ్యారు. బౌలింగ్​లో బ్రావో 3 వికెట్లు, కర్ణ్ శర్మ్, కరన్, శార్దుల్ ఠాకుర్ తలో రెండు వికెట్లు తీశారు. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న చెన్నై జట్టు.. అక్టోబరు 10న బెంగళూరుతో తలపడనుంది.

ABOUT THE AUTHOR

...view details